మహేష్ తో నటించనని చెప్పిందట !
- April 29, 2017 / 01:50 PM ISTByFilmy Focus
టాలీవుడ్ టాప్ హీరోస్ లో ప్రిన్స్ మహేష్ స్థానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ కరియర్ ఆరంభంలో కాస్త తడబడినా…తరువాత వరుస హిట్స్ తో దూసుకుపోయాడు..పోకిరి సినిమాతో మంచి మాస్ హీరోగా ఎలివేట్ అయిన ప్రిన్స్…ఆ తరువాత దూకుడు, శ్రీమంతుడు అంటూ తనకంటూ భారీ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకుంటూ…టాలీవుడ్ టాప్ హీరో రేస్ లో ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటున్నాడు..ఇదిలా ఉంటే ఇలాంటి మహేష్ సినిమాలో నటించమంటే ఎవ్వరైనా ఎగిరి గంతులు వేస్తారు…కానీ ఒకరు మాత్రం ప్రిన్స్ తో నటించడం కుదరదు అని చెప్పారట…ఇంతకీ ఎవరామె ఏమా కధ అంటే…మాత్రం మనం ఈ కధ చదవాల్సిందే…విషయంలోకి వెళితే…గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన మహేష్ ఆ సినిమాలో తన తల్లి పాత్రను చెయ్యమని అడగగా…ఒక సీనియర్ నటి నో చెప్పి పాత్రను తిరస్కరించింది అని సమాచారం.
ఆ సీనియర్ నటి ఎవరో కాదు….నటి సుధ. సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు వేస్తున్న సుధ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఎంటో తెలిస్తే..షాక్ అవుతారు. తల్లిగా , వదినగా నటించింది సుధ మహేష్ బాబు అంటే ఇష్టం కూడా కానీ శ్రీమంతుడు చిత్రంలో తల్లి పాత్ర కు అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి అలాంటి పాత్ర ని ఎందుకు చేయాలి డబ్బు కోసమా ? అంటూ నిరాకరించిందట. అయితే ఈ పాత్రను ఆమె తిరస్కరించడంలో తప్పు లేదు ఎందుకంటే ఈ సినిమా ఆ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు. మొత్తంగా అదీ మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















