Sudheer Babu: బ్రహ్మాస్త్రను సుధీర్ బాబు రిజెక్ట్ చేయడానికి కారణమిదేనా?

సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలవుతుండగా బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం వీకెండ్ లో కలెక్షన్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

రేపు రిలీజవుతున్న సినిమాలలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఈ సినిమాకే దక్కాయి. టికెట్ రేట్లు కూడా తక్కువగానే ఉండటం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుధీర్ బాబు, కృతిశెట్టి, ఇంద్రగంటి మోహనకృష్ణలకు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అనే సంగతి తెలిసిందే. అ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రమోషన్లలో భాగంగా సుధీర్ బాబు బ్రహ్మాస్త్ర సినిమాలో తనకు చాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశానంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్లే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించలేకపోయానని సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చేశారు. అయితే బ్రహ్మాస్త్ర పార్ట్1 లో ఏ పాత్రను రిజెక్ట్ చేశారనే విషయాన్ని మాత్రం సుధీర్ బాబు వెల్లడించలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ కథల్ని నమ్మి ఆయన డైరెక్షన్ లో నేను నటిస్తున్నానని సుధీర్ బాబు తెలిపారు. ఉప్పెన కంటే ముందు ఈ సినిమా కోసం కృతిశెట్టిని ఎంపిక చేయడం జరిగిందని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉంటాయని సుధీర్ బాబు అన్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా అంచనాలను అందుకుంటుందేమో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus