సుధీర్‌బాబు సినిమాల శాటిలైట్‌ హక్కులు భలే భలే!

కొన్ని సినిమాలకు టీవీ డీల్స్‌ కుదరడం చాలా కష్టం. సినిమా భారీ విజయం సాధిస్తే ఓకే కానీ, ఓ మోస్తరు విజయం అందుకుంటే, ఫ్లాప్‌ అయితే వాటికి టీవీ డీల్స్‌ కుదర్చడానికి చాలా ప్రయత్నాలు చేసి, కొన్ని త్యాగాలు చేసి డీల్స్‌ కుదర్చాలి. అయితే టాలీవుడ్‌లో ఓ హీరోకి మాత్రం చాలా ఈజీగా టీవీ డీల్స్‌ అదేనండీ శాటిలైట్‌ హక్కుల అమ్మకం ఈజీగా అయిపోతుందని అంటున్నారు. అతనే సుధీర్‌బాబు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ త్వరలో కృతి శెట్టితో కలసి వస్తున్నాడు సుధీర్‌బాబు. ఈ సినిమా గురించే ఇదంతా.

వారసత్వం అని కాదు కానీ, బంధుత్వం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అంటూ సుధీర్‌బాబు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కొంతమంది అనేవారు. అయితే ఈ గుర్తింపును పక్కన పెట్టి.. సొంతంగా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు సుధీర్‌బాబు. బాలీవుడ్‌లో విలన్‌గా నటించి కూడా వచ్చాడు. అయితే గత కొన్ని సినిమాలుగా ఆయన సరైన విజయం అందడం లేదు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘నన్ను దోచుకుందువటే’, ‘సమ్మోహనం’ వంటి సినిమాలు చేశాడు. ఇందులో ఆర్థికంగా లాభాలు ఇచ్చింది ఆఖరి సినిమానే అంటారు.

అయితే, శాటిలైట్‌ హక్కుల పరంగా మాత్రం ఆ సినిమాకు మంచిగానే బిజినెస్‌ జరిగింది. ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్’ సినిమాల విషయంలో శాటిలైట్‌ హక్కుల బజ్‌ బాగానే ఉంది అని చెబుతున్నారు. ఈ సినిమాకు విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ డీల్స్ పూర్తయినట్లు సమాచారం. స్టార్‌ మా వాళ్లు ఈ సినిమాలకు మంచి ధర ఇస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల ముచ్చట. ఇదంతా చూస్తుంటే సుధీర్‌బాబుకి శాటిలైట్‌ స్టార్‌ అనే బిరుదు ఇచ్చేస్తారేమో అనిపిస్తోంది.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాను సెప్టెంబరు 16న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమా చాలా నెలల క్రితమే పూర్తయింది. అయితే వాయిదాలు పడుతూ, పడుతూ ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. సినిమా, నటులు నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆసక్తికరంగా ఉందనే టాక్‌ వినిపిస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus