టాలీవుడ్‌లో స్టార్ ఫ్యామిలీ వారసులు వెండితెరపై అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా స్టార్ హీరోల పిల్లలు హీరోలు, హీరోయిన్‌లు, చైల్డ్ ఆర్టిస్టులుగా పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు అదే రేసులో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త టాలెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన ఘట్టమనేని వారసులలో ఇప్పటికే పలువురు సినిమాల్లో హీరోలుగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ లిస్టులో యాక్షన్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్ బాబు కూడా ఒకరు. సుధీర్ బాబు కి ఇద్దరు కుమారులు చరిత్ అండ్ దర్శన్ . వీరిలో చరిత్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన “భలే భలే మగాడివోయ్” లాంటి పలు చిత్రాల్లో స్క్రీన్ పై అందర్నీ ఆకట్టుకున్నాడు. మరో రెండు ఏళ్లలో హీరో గా ఎంట్రీ ఇవ్వటానికి ట్రైన్ కూడా అవుతున్నాడు.
అయితే చిన్నవాడు దర్శన్ ఇప్పటికే తన మేన మామ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కారు వారి పాట” మూవీ లో మహేష్ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఇమాన్వి & కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా, హను రాఘవపూడి డైరెక్షన్లో చిత్రీకరిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఫౌజీ” మూవీ లో ప్రభాస్ చిన్ననాటి క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు అంట . అయితే ఈ మూవీ కోసం దర్శకుడు హను రాఘవపూడి దర్శన్ ను వేదాలు నేర్చుకోమన్నట్లు సమాచారం.
దర్శన్ పట్టుదలతో వేదాలు, మంత్రాలు కంఠత చేసాడని, చాలా శ్రమించి నేర్చుకున్నాడని సుధీర్ బాబు తెలిపారు. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా , ఈ మూవీ యూనిట్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఆగష్టు 2026లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్.