సుడిగాలి సుధీర్.. బుల్లితెర పై బోలెడంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బుల్లితెర పై ఇతను ఓ పవర్ స్టార్ లా చలామణి అవుతున్నాడు. సుధీర్ సోషల్ మీడియా ఖాతాలకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా బిజీ అవుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా, హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.
ఇక ఇప్పుడు ‘గాలోడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతోనే ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. పాటలు కూడా హిట్ అవ్వడంతో.. సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అందువల్ల సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు బుల్లితెర ఆర్టిస్ట్ లు హీరోలుగా నటించిన ఏ సినిమాకి కూడా ఇంత బిజినెస్ జరగలేదు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. సుధీర్ ‘గాలోడు’ సినిమాకి బిజినెస్ బాగా జరిగింది.
ముఖ్యంగా సీడెడ్ లో కొంతమంది యంగ్ హీరోల సినిమాలకు కూడా జరగని బిజినెస్ సుధీర్ సినిమాకి జరిగింది. అతనికి ఎంత క్రేజ్ ఉంది అనేదానికి ఇది నిదర్శనం. అయితే ఈ విషయంపై అతని స్పందన నిజంగా గొప్పగా ఉంది అనే చెప్పాలి. సుధీర్ ఈ విషయం పై మాట్లాడుతూ.. ” నా సినిమాకు ఇంత బిజినెస్ జరిగింది అంటే నిజంగా నాకు ఆనందంగానే ఉంది. అదే సమయంలో కొంత భయం కూడా ఉంది.
ఎందుకంటే నా సినిమాని ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న బయ్యర్లు ఒక్క రూపాయి కూడా పోగొట్టుకొకూడదు. ఎవ్వరూ అప్పుల పాలు కాకూడదు. నేను కూడా గతంలో అప్పుల బాధలు వంటివి అనుభవించాను. కాబట్టి.. అదే నా భయం. నా సినిమా వల్ల వాళ్లకు ఎంత లాభం వచ్చినా నాకు సంతోషమే. కానీ వారికి ఒక్క రూపాయి కూడా పోకూడదు అని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.