బుల్లితెరపై స్టార్ స్టేటస్ ను అందుకున్న సుధీర్ వెండితెరపై కూడా ఒక వెలుగు వెలగాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. గాలోడు సినిమా తాజాగా భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు కలెక్షన్లు నిరాశాజనకంగా ఉండటం ఫ్యాన్స్ ను మరింత బాధ పెడుతోంది. అయితే సుధీర్ రష్మీ మధ్య ఏదో ఉందని ప్రచారం జరగడంతో పాటు రాబోయే రోజుల్లో రష్మీ సుధీర్ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే సుడిగాలి సుధీర్ తాజాగా వైరల్ అయిన వార్తల గురించి స్పందించడంతో పాటు ప్రచారంలోకి వస్తున్న వార్తలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేశారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చారు. నేను రష్మీ ఒకరినొకరు పట్టుకోమని ముట్టుకోమని ఆ రీజన్ వల్లే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని సుడిగాలి సుధీర్ కామెంట్లు చేశారు. నేను, రష్మీ కళ్లతో మా మనసులోని ఎక్స్ ప్రెషన్స్ ను బయటపెట్టే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.
ఆన్ స్క్రీన్ మీద నాకు రొమాన్స్ ఇష్టం ఉండదని అయితే నేను దర్శకునికి చెప్పే స్థాయిలో అయితే లేనని సుధీర్ వెల్లడించారు. ఒకవేళ నా రేంజ్ మరింత పెరిగితే మాత్రం అలాంటి సన్నివేశాలు వద్దని దర్శకునికి సూచనలు చేస్తానని సుడిగాలి సుధీర్ పేర్కొన్నారు. నాకు పెళ్లి అంటే ఇష్టం లేదని పెళ్లి చేసుకోనని సుడిగాలి సుధీర్ పేర్కొన్నారు.
రష్మీతో పెళ్లి జరగదని సుడిగాలి సుధీర్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. సుధీర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుధీర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఆ ప్రాజెక్ట్ లు కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!