సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ఈ జంటకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేసిన సుధీర్ అనంతరం టీం లీడర్ గాను అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గాను గుర్తింపు పొందారు. అయితే ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే మాత్రం ఆ కార్యక్రమంలో సుదీర్ రష్మి తప్పకుండా సందడి చేయాల్సి ఉంటుంది. ఇలా సుధీర్ రష్మీ జోడికి విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
వీరిద్దరి ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండడంతో ఈ జోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే సుధీర్ కు సినిమాలలో అవకాశాలు రావడంతో ఈయన బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ సినిమాలలో బిజీ అయ్యారు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన మరోసారి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు అయితే ఓకే వేదికపై రష్మీ సుధీర్ ని చూడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ఇందులో సుధీర్ మాట్లాడుతూ మేడంగారు ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు అంటూ మాట్లాడటంతో రష్మీ సుధీర్ మాటలకు బదులిస్తూ…నువ్వొస్తావని ఇన్ని రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాను అంటూ ఓర చూపులతో చిన్న స్మైల్ ఇస్తూ ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ అంటూ ప్రశ్నించింది.
రష్మీ ఈ విధంగా ప్రశ్నించడంతో సుధీర్ (Sudigali Sudheer) సమాధానం చెబుతూ నేను ఎక్కడున్నా నా గుండెల్లో నువ్వే ఉంటావు అంటూ సమాధానం చెప్పారు. రశ్మిని ఉద్దేశిస్తూ సుదీర్ ఇలా చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఇలా రష్మీ గురించి సుధీర్ ఇలా చెప్పడంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!