శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుదీర్… వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. ఇలా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ విపరీతమైన ఆదరణ పొందారు. ఇక ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా ఈ బుల్లితెర కార్యక్రమాలలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి సుధీర్ యాంకర్ రష్మితో కలిపి పెద్ద ఎత్తున పులిహోర కలిపేవారు.

అయితే ఇదంతా నిజమేనని అందరూ భావించినప్పటికీ ఇది కేవలం షో రేటింగ్ కోసమేనని తెలిసిపోయింది అయితే ఇప్పటికీ సుదీర్ రష్మీ జంట గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి.ఇలా బుల్లితెర కార్యక్రమాల నుంచి దూరమైనటువంటి సుధీర్ తిరిగి ఈ కార్యక్రమాలలోకి రావాలని ఎంతోమంది ఆకాంక్షించారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ వేదికపై సందడి చేయడంతో ఒక్కసారిగా అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా సుధీర్ వచ్చి రాగానే రష్మీ పక్కన నిలబడటంతో రష్మి సైతం ఎంతో సంతోషంగా కనిపించారని తెలుస్తోంది. అయితే ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రోమోలో భాగంగా ఇంద్రజ మాట్లాడుతూ శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు తమ జీవితాలలో మార్పులు తీసుకువచ్చిన వ్యక్తులని పిలిచి ఈ స్టేజిపై థ్యాంక్స్ చెప్పబోతున్నారని తెలిపింది. ఇంద్రజ ఇలా చెప్పగానే వెంటనే డైరెక్టర్ తేజ, ఆర్పీ పట్నాయక్, సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చారు.

అలాగే ఈ ప్రోమోలో సుధీర్ తో పాటు రాంప్రసాద్ గెటప్ శ్రీను హైపర్ ఆది కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుధీర్ కేవలం ఈ కార్యక్రమానికి గెస్ట్ లా వచ్చారా లేక ప్రతివారం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయబోతున్నారా అనే విషయం తెలియదు కానీ సుదీర్ ఇలా రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus