Sudigali Sudheer: అనారోగ్యంతో బాధపడుతున్న సుధీర్… వైరల్ అవుతున్న గాసిప్!
- September 26, 2022 / 12:52 PM ISTByFilmy Focus
మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ టాలెంట్ గుర్తించి మల్లెమాలవారు తనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ఈయన అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు. అలాగే ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో టీం లీడర్ గా కొనసాగుతూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక వెండితెరపై సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇండస్ట్రీలో సుడిగాలి సుదీర్ ఎంతో క్రేజ్ సంపాదించుకోగా ఈయన ఉన్నఫలంగా మల్లెమాల వారి కార్యక్రమాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు.ఇలా ఈటీవీకి దూరమైన సుధీర్ స్టార్ మా లో ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆ చానల్లో కూడా ఈయన కనిపించడం లేదు.ఇలా సుడిగాలి సుదీర్ పూర్తిగా ప్రేక్షకులకు దూరం కావడంతో అసలు సుధీర్ కి ఏమైంది ఎందుకు దూరంగా ఉంటున్నారనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలోనే సుదీర్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.సుధీర్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారని అందుకే ఆయన బయట కూడా కనిపించలేని పొజిషన్ లో ఉన్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈయన ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారనే విషయం తెలియకపోయినా సుడిగాలి సుదీర్ వింత వ్యాధితో బాధపడుతున్నారని వార్త ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇదంతా కేవలం సుదీర్ బుల్లితెరపై కనిపించకపోవడంతోనే ఇలాంటి వార్తలు సృష్టించారని

సుధీర్ కు ఏ విధమైనటువంటి సమస్య లేదంటూ మరికొందరు ఈ వార్తలను ఖండిస్తున్నారు.అయితే సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఇప్పటికే ఈ విషయం తన సన్నిహితుల ద్వారా తెలిసేది. అయితే తన సన్నిహితుల నుంచి ఈ విషయంపై ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవడంతో ఇవన్నీ ఒట్టి వార్తలేనని కొట్టి పారేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సుడిగాలి సుదీర్ స్పందించాల్సి ఉంది.
కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!











