సుహాస్ మరోసారి తండ్రయ్యాడు. అతని భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది రెండో సంతానం.2024 జనవరి 22న వీరికి మగబిడ్డ జన్మించాడు. ఇప్పుడు 2వ సారి కూడా సుహాస్ దంపతులకి అబ్బాయి జన్మించడం విశేషంగా చెప్పుకోవాలి. తన సోషల్ మీడియాలో సుహాస్..’ఇట్స్ ఎ బాయ్ అగైన్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సుహాస్.
అలాగే హాస్పిటల్లో తన భార్య, బిడ్డ వద్ద తీసుకున్న ఫోటోని కూడా షేర్ చేశాడు. దీంతో సుహాస్ ఫాలోవర్స్ అంతా ‘కంగ్రాట్స్’ చెబుతూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన సుహాస్… తర్వాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.’ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ ‘డియర్ కామ్రేడ్’ ‘పడి పడి లేచే మనసు’ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి సినిమాల్లో సహాయనటుడి పాత్రలు చేసి మెప్పించాడు.
తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫోటో’ ‘రైటర్ పద్మభూషణ్’ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ‘జనక అయితే గనక’ వంటి సినిమాలతో తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. అలాగే వెబ్ సిరీస్..లు వంటి వాటితో కూడా అలరిస్తున్నాడు. పెద్ద సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు సుహాస్. ‘హిట్ 2’ లో విలన్ గా చేసిన సుహాస్.. ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాలో కూడా చిన్న కేమియో ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. అలా కెరీర్ ను బ్యాలెన్స్డ్ గా లాగిస్తున్నాడు.