Suhasini Maniratnam: మణిరత్నం సుహాసిని ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోయిన్లలో ఒకరైన సుహాసిని నటిగా, నిర్మాతగా మంచి పేరును సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుహాసిని నటిగా చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. తమిళ సినిమాలతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుహాసిని తెలుగులోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. అయితే సుహాసిని మణిరత్నం పెళ్లికి కొన్ని నెలల ముందు ఈ జోడీ గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి. సుహాసిని తండ్రి చారు హాసన్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరగా తండ్రిని చూడటానికి వెళ్లిన సుహాసినిని ఆయన సినిమాలు చేయవద్దని అన్నారు.

మణిరత్నంసుహాసిని గురించి గాసిప్స్ వైరల్ అవుతున్నాయని ఆ వదంతుల గురించి ఒకసారి మణిరత్నంతో మాట్లాడాలని చారుహాసన్ సుహాసినికి సూచించారు. తండ్రి సూచనల ప్రకారం సుహాసిని మణిరత్నంకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఆ ఫోన్ కాల్ తర్వాత సుహాసినికి మణిరత్నంపై గౌరవం పెరిగింది. ఆ తర్వాత సుహాసిని మణిరత్నం ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడినా ఆ విషయం మాత్రం పెద్దలకు చెప్పలేదు. అదే సమయంలో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని వీరి పెళ్లి చేశారు.

ఇండస్ట్రీలో వచ్చిన వదంతులు మణిరత్నం, సుహాసినిల పెళ్లికి కారణమయ్యాయి. 1988 సంవత్సరం ఆగష్టు 25వ తేదీన సుహాసిని మణిరత్నంల వివాహం జరిగింది. ప్రస్తుతం సుహాసిని పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను సుహాసిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సుహాసిని ప్రేమకథలో ట్విస్టులు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

Most Recommended Video
S
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus