డైరక్టర్ సుకుమార్ ఆలోచనలు టాలీవుడ్ ని ఒక అడుగు ముందుకు పోనిచ్చేలా ఉంటాయి. ఆయన మూవీస్ లో ప్రతిదీ డిఫరెంట్ గా చూపిస్తారు. టైటిల్ కార్డ్స్ లోను ఆయన స్టైల్ కనిపిస్తుంది. ప్రేమను కూడా అంకెల్లో కొలవచ్చని సుకుమార్ 100% లవ్ ప్రేమకథను రాసుకున్నారు. అలాగే పరీక్షలు, ర్యాంకుల గోల… ఈ విషయం అర్ధమయ్యేలా టైటిల్ కార్డ్స్ ని పరీక్ష ప్రశ్న పత్రం రూపంలో చూపించారు. నేనొక్కడినే లో చిన్నప్పటి సాంగ్ చుట్టూ కథ తిరుగుతుంటుంది. ఆ పాట గుర్తుకు రాగానే అన్ని చిక్కుముడులు విడిపోతాయి. ఆ ట్యూన్, ఆ ఇన్స్ట్రుమెంట్ డిఫెరెంట్ గా ఉంటుంది. అందుకే టైటిల్ కార్డ్స్ మొత్తము ఆ ఇన్స్ట్రుమెంట్ మెకానిజంతో తో లింక్ అయి ఉంటాయి. ఒకచోట జరిగే యాక్షన్ ఇంకోచోట లింక్ అయి ఉంటది.. ఈ థీమ్ తోనే నాన్నకు ప్రేమతో.. మూవీ కథ ముడిపడి ఉంటుంది.
అందుకే టైటిల్ కార్డ్స్ కూడా ఒక చైన్ రియాక్షన్ ద్వారా మనకు చూపించారు. ఈసారి పాతికేళ్ళు వెనక్కి వెళ్లారు. ఆనాటి కథతో రంగస్థలం సినిమా చేసారు. మరి ఈ సినిమా టైటిల్స్ లో ఎటువంటి క్రియేటివిటీ చూపిస్తారోనని అతని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆ స్టైల్ కనిపించలేదు. దీని గురించి తాజాగా జరిగిన `రంగస్థలం` విజయోత్సవ సభలో సుకుమార్ మాట్లాడారు. “ఈ సినిమా విషయంలోనూ నా స్టైల్ ఫాలో అవ్వాలనే అనుకున్నాను. 80ల నాటి వస్తువులను చూపిస్తూ వాటిలోనే టైటిల్స్ వేయాలని ప్లాన్ చేశాను. అయితే సినిమా అప్పటికే మూడు గంటలు ఉంది. ఈ టైటిల్స్ ట్రాక్‌కు ఇంకో మూడు, నాలుగు నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశా. సమయాన్ని మరింత సేవ్ చేసేందుకు టైటిల్స్ పడుతున్నప్పుడే కథ మొదలెట్టేశా. టైటిల్స్ విషయంలో నా స్టైల్‌ను ఇష్టపడే వారిని నిరాశపరిచినందుకు సారీ` అని సుకుమార్ వివరణ ఇచ్చారు.