ఇవాళ “రంగస్థలం” ఆడియోను యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుకుమార్ తోపాటు నిర్మాతలు కూడా పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుకుమార్ “రంగస్థలం” గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిజయేశాడు.
“రంగస్థలం” సినిమాలో ఒక సప్రయిజ్ ఉంది ఆ పాటను చంద్రబోస్ స్వయంగా పాడారు. అది సినిమాలో చూడాలి. సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాటను విడుదల చేస్తాము. 1980 నేపథ్యంలో జరిగే కథతో ఈ సినిమా ఉంటుంది. అప్పటి కాలం నుండి వచ్చిన కాలం వారికీ బాగా కనెక్ట్ అవుతుంది. చంద్ర బోస్ దేవి కాంబినేషన్ పాటలు సినిమాకు మెయిన్ ఎస్సెట్. ఈ సినిమా చేయడానికి కారణం 1 నేనొక్కడినే,నాన్నకు ప్రేమతో సినిమాలను ఫారెయిన్ బ్యాక్ డ్రాప్ లో చేసినప్పుడు ఒక వ్యక్తి మీరు హాలీవుడ్ స్టైల్ లో సినిమాలు చేస్తున్నారు. కానీ మన నేపధ్యం లో సినిమాలు చేయరు అని అడిగినప్పుడు. కాస్త సిగ్గుగా అనిపించింది. అందుకే ఈ సినిమా అనుకున్నాను. నేను 28 ఏళ్ళు పల్లెటూర్లోనే పుట్టి పెరిగాను. ఇది నా ఆత్మ ను వెతికే ప్రయత్నం అని చెప్పాలి. పల్లెటూర్లు అంటే ఒక నాటకం జరిగే ప్రదేశము లా అనిపిస్తుంది. అక్కడ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అందుకే రంగస్థలం అని పేరు పెట్టాం.