మహేష్ 26 కోసం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్.!

2018లో ‘జైసింహా, భాగమతి, తొలిప్రేమ’ చిత్రాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం. ఆ సినిమా విడుదలైన సరిగ్గా 21 రోజులు అనగా మూడు వారాల అనంతరం తెలుగు చిత్రసీమ “భరత్ అనే నేను“తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ లో మాత్రమే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘన విజయం అందుకోవడం ఈ రెండు సినిమాలూ వంద కోట్ల గ్రాస్ సొంతం చేసుకోవడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ కళకళ తగ్గకముందే అల్లు అర్జున్ “నా పేరు సూర్య” అంటూ దూసుకొస్తున్నాడనుకోండి అది వేరే విషయం.

అయితే.. “రంగస్థలం”తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న సుకుమార్, “భరత్ అనే నేను”తో సూపర్ హిట్ సొంతం చేసుకొన్న మహేష్ బాబుల కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. వంశీపైడిపల్లి-మహేష్ ల కాంబినేషన్ సినిమా అనంతరం మహేష్-సుకుమార్ ల చిత్రం ప్రారంభమవుతుంది. ఇదివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ఒన్ నేనొక్కడినే” కంటెంట్ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం తేలిపోయింది. దాంతో ఈ రెండో చిత్రంతో మాత్రం సూపర్ హిట్ కొట్టాలన్న ధృడ నిశ్చయంతో సుకుమార్. “భరత్ అనే నేను” తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంతో మరో హిట్ కొట్టి అనంతరం సుకుమార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలన్న అంతఃకరణ శుద్ధితో మహేష్ బాబు అప్పుడే ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలెట్టేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus