ఆ డైరెక్టర్ బదులు ఈ డైరెక్టర్ ను వాడేస్తున్న మెగాస్టార్..!

‘ఖైదీ నెంబర్ 150’ తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తరువాత ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో కాస్త స్లో ఆయ్యారు. అందులోనూ ఆ చిత్రానికి రెండేళ్ళ వరకూ టైం కేటాయించారు కూడా..! ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఆగిపోయింది. 2021 సంక్రాంతి వరకూ ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది కాబట్టి మెగాస్టార్ తరువాత చెయ్యబోయే ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్ట్ పైనే దృష్టి పెట్టారని తెలుస్తుంది.

మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. అయినప్పటికీ ‘లూసిఫర్’ ను మళ్ళీ చిరు రీమేక్ చేస్తున్నారు అని తెలియగానే చాలా మంది ఆ చిత్రాన్ని ఆన్లైన్లో చూసేసారు. అయితే తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగినట్టుగా కొన్ని మార్పులతో రీమేక్ చెయ్యబోతున్నారట. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. అయితే అతను తన పెళ్ళి హడావిడిలో ఉండడంతో.. ఈ స్క్రిప్ట్ పనులను దర్శకుడు సుకుమార్ కు అప్పగించారట మన మెగాస్టార్.

ఎలాగూ సుకుమార్ డైరెక్ట్ చెయ్యాల్సిన ‘పుష్ప’ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం లేదు కాబట్టి.. సుకుమార్ కూడా ‘లూసిఫర్’ స్క్రిప్ట్ పై పనిచెయ్యడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి మొదటి ‘లూసిఫర్’ ను సుకుమార్ తోనే రీమేక్ చెయ్యించాలి అని మెగాస్టార్ అనుకున్నారు. కానీ సుకుమార్ ‘పుష్ప’ కు కమిట్ అవ్వడంతో అది కుదర్లేదని తెలుస్తుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus