ఈ సారి పుష్ప -2 వేరే లెవల్ లో ఉండబోతోంది.!

ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో ఐటీ రెయిడ్స్‌ టాలీవుడ్‌లో సంచలనం రేపింది. మైత్రి మూవీస్‌, సంస్థ డైరెక్టర్లు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఏకకాలంలో డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఐటీ దాడుల వలన పుష్ప -2 దిరూల్ కు షూటింగ్ బ్రేక్ పడింది. ఇప్పుడు వాటి నుండి బయటపడి షూటింగ్ ప్రారంభించారు. పుష్పరాజ్‌ పాత్రతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఓ ఊపు ఊపారు అల్లు అర్జున్‌. గత ఏడాది విడుదలైన ‘పుష్ప’ చిత్రం అదరగొట్టే కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది.

ఆ సినిమా ఫలితంతో అంతే జోరుగా సుకుమార్‌ ‘పుష్ప-2’ తెరకెక్కిస్తున్నారు. మొదటిపార్ట్‌ సాధించిన విజయంతో ‘పుష్ప-2’ అంతకుమించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు లెక్కల మాస్టర్‌. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్‌ పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ఒడిస్సాలోని కలిమెల జిల్లా మన్యంకొండ పంచాయతీ పొల్లేరు గ్రామంలో సందడి చేస్తున్నారు. చిత్రకరణలో భాగంగా లొకేషన్‌ల వేటలో పడ్డారు చిత్ర బృందం. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ ప్రొడక్షన్‌ మేనేజర్‌ పి.వేంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ ఏప్రిల్‌లో వివిధ ప్రాంతాలను పరిశీలించారు.

మల్కన్‌గిరి కలెక్టర్‌ విశాల్‌సింగ్‌, ఎస్పీ నితీష్‌లను కలిసి, షూటింగ్‌ నిమిత్తం అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 20మందితో కూడిన బృందం దర్శకుడు సుకుమార్‌, సినిమాటోగ్రఫీ మిరస్లోవ్‌ కుబా బ్రోచెక్‌ తదితరులు షూటింగ్‌ చేయనున్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడారు. ప్రకృతి సౌందర్యానికి మల్కన్‌గిరి జిల్లా పెట్టింది పేరని అన్నారు. పొల్లేరు ప్రాంతంలో మరో 2 నెలల్లో షూటింగ్‌ ప్రారంభిస్తామని, ‘పుష్ప’ ఎంతటి ఘన విజయం సాధించిందో, రెండో భాగం కూడా అదే స్థాయిలో అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక్కడి స్వాభిమాన్‌ ఏరియా హంతాళ్‌గూడ ఘాట్‌ రోడ్డు, బలిమెల రిజర్వాయర్‌, పొల్లేరు చుట్టుపక్కల ఉన్న వంతెనలు, నదులు, కాలువలు ఉన్న పరిసరాల్లో చిత్రీకరణ చేయడానికి చూస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న చిత్రీకరణలో అల్లు అర్జున్‌, రష్మిక, సునీల్‌ తదితరులు పాల్గొనున్నట్లు చెప్పారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus