అభిమానులని మళ్ళీ టెన్షన్ పెడుతున్న మహేష్ – సుకుమార్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే తరువాత రెండు డిజాస్టర్లు పడతాయనే సెంటిమెంట్ ఎప్పటినుండో ఉంది. దీనికి అసలు కారణం పరిశీలిస్తే ఒక హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో ఫుల్ స్క్రిప్ట్ విని.. డైరెక్షన్ డిపార్టుమెంట్లో ఎప్పటికప్పుడు అన్ని విషయాల్ని తెలుసుకుంటూ, సరైన షాట్ వచ్చే వరకు చాలా కష్టపతాడట. అదే ఆల్రెడీ ఒక హిట్ సాధిస్తే మాత్రం డైరెక్టర్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడని.. అందులోనూ ఆల్రెడీ మహేష్ కు ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్కి అయితే ఇక ఏ విషయంలోనూ కలిగించుకోకుండా గుడ్డిగా సినిమాలు చేసేస్తాడనే గాసిప్ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. సాధారణంగా ఒకసారి మహేష్ కు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మహేష్ మళ్ళీ పనిచేసింది లేదు. అయితే మొదటిసారి మహేష్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో తన 26 వ సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే చిత్రం ఘోర డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో మరోసారి వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

2018 లో ‘రంగ‌స్థ‌లం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. మొదట మహేష్ కు ఓ పీరియాడిక్ డ్రామాగా సాగే కథను వినిపించాడట సుకుమార్. అయితే హిస్టారిక‌ల్ సబ్జెక్ట్‌ పై అంత‌గా ఇంట్రెస్ట్ లేకపోవడంతో మ‌హేష్ మ‌రో క‌థ‌ సిద్ధం చేయ‌మ‌ని సుకుమార్‌ ను కోరాడట. దాంతో ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ ను సిద్ధం చేసి మ‌హేష్‌కి వినిపించ‌గా… ఆ క‌థ‌ మ‌హేష్ కి చాలా నచ్చేసిందట. దీంతో ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టాడంట సుకుమార్. అయితే గతంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రం కూడా థ్రిల్లర్ మూవీ గానే తెరకెక్కింది. ఇప్పుడు మళ్ళీ అదే కాదాంశం కాబట్టి… ఈ చిత్రం కూడా ‘1 నేనొక్కడినే’ తరహాలో నిరాశ పరుస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారట అభిమానులు. అసలే ‘భరత్ అనే నేను’ హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి.. అలాగే ‘మహేష్ 26’ డైరెక్టర్ సుకుమార్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుండడంతో… మళ్ళీ ఎక్కడ రెండు డిజాస్టర్లు పడతాయో అని మహేష్ అభిమానులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ‘మహేష్ 26’ చిత్రానికి 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతున్నాడట సుకుమార్. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి దేవి శ్రీ ప్రసాద్‌ని సెలెక్ట్ చేయబోతున్నారట. 2019 ఫిబ్రవరి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుండగా… రెగ్యులర్ షూటింగ్ ‘మర్చి’ నుండీ మొదలుకాబోతుందట.ఇక ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus