టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలన్నిటికీ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుంటారు. దేవిశ్రీ లేకుండా సినిమా చేయడం కష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు సుకుమార్. దేవి తనకు సోల్ అంటూ వారిమధ్య బాండింగ్ గురించి గొప్పగా చెప్పేవారు సుకుమార్. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలతో పాటు నిర్మించే సినిమాలకు కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారు. దేవిశ్రీప్రసాద్ కూడా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సుకుమార్ సినిమాలకు పని చేశారు.
‘కుమారి 21 ఎఫ్’ లాంటి చిన్న సినిమాకి మంచి ఆల్బమ్ అందించారు దేవిశ్రీప్రసాద్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను కార్తీక్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ సుకుమారే అందించారు. అయితే ఈ సినిమాకి మాత్రం దేవిశ్రీప్రసాద్ ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ‘కాంతారా’ సినిమా సంగీత దర్శకుడు అంజనీష్ లోక్‌నాథ్‌ని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారట.
సుకుమార్ టీమ్ లో దేవిశ్రీప్రసాద్ లేకపోవడం ఇదే మొదటిసారి. మొదట ఈ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. అయితే దేవి ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ అడిగారట. దేవి అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ రెడీ అయ్యారు. కాకపోతే బడ్జెట్ కంట్రోల్ లో ఉంచడానికి.. సుకుమార్ రంగంలోకి దిగి.. అంజనీష్ ను ఎన్నుకున్నారని సమాచారం. హీరో సాయిధరమ్ తేజ్ హిట్ కొట్టి చాలా కాలమైంది.
అతడి మార్కెట్ కొంచెం డల్ అయింది. ఇలాంటి సమయంలో ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చేయడం కంటే కంట్రోల్ బడ్జెట్ లో తీయాలనుకుంటున్నారు. ఆ కారణంగానే దేవిశ్రీప్రసాద్ ను తప్పించినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!