ఈసారి మహేష్ కి హిట్ ఇద్దామనే ఆలోచనతో

స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం, రిపీటెడ్ సీన్స్ ఎక్కువవ్వడంతో ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో “ఒన్ నేనుక్కడినే” సినిమాని ఫ్లాప్ చేశారు తప్పితే.. మహేష్ బాబు కెరీర్ లో ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్ మాత్రమే కాదు మహేష్ అత్యుద్భుతంగా నటించిన మొదటి అయిదు సినిమాల లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో నిలిచేందుకు అన్నీ లక్షణాలు ఉన్న సినిమా “ఒన్ నేనొక్కడినే”. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా చాలాసార్లు మీడియా ముఖ్యంగానే కాక ట్విట్టర్ లోనూ పేర్కొన్నాడు. అలాగే సుకుమార్ తో మరోమారు తప్పకుండా పనిచేస్తానని కూడా మహేష్ పలుమార్లు పేర్కొన్నాడు.

అయితే.. అది త్వరలోనే మెటీరియలైజ్ కానుందని తెలుస్తోంది. సుకుమార్ ఇటీవల మహేష్ బాబుని కలిసి ఒక కథ చెప్పాడట.. మామూలుగానే సుకుమార్ వర్క్స్ కి మాంచి ఫ్యాన్ అయిన మహేష్ వెంటనే ఒకే చేశాడట. ప్రస్తుతం కొరటాల శివ సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత వంశీ పైడిపల్లితో ఒకటి, బోయపాటితో మరొకటి, ఈ రెండూ అయ్యాక రాజమౌళీతో ఒక సినిమా సైన్ చేశాడు. ఈ ప్రొజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక సుకుమార్ తో సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడట. చూద్దాం మరి చాలా టైమ్ ఉంది కాబట్టి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus