మొదటి దెబ్బ గట్టిగా కొట్టాలని చూస్తున్న బన్నీ, సుక్కు

  • May 14, 2020 / 03:30 PM IST

ఆరంభం అద్భుతంగా ఉంటే జర్నీ స్మూత్ గా సాగుతుంది. అలాగే ఫస్ట్ అట్టెంప్ట్ లో మంచి ఇంప్రెషన్ దక్కించుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పుడు అదే ప్లాన్స్ లో ఉన్నారు అల్లు అర్జున్ మరియు సుకుమార్. వీరిద్దరూ తమ హ్యాట్రిక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో విడుదల కానుంది. హిందీలో కూడా పుష్ప విడుదల అవుతుండగా వీరిద్దరికీ ఇది మొదటి చిత్రం.

దీనితో వీరు ప్రత్యేకమైన ప్రణాళికలతో సన్నద్ధం అవుతున్నారట. మొదటి సినిమాతోనే బాలీవుడ్ పై గట్టి ప్రభావం చూపాలని వీరు తపన పడుతున్నారని తెలుస్తుంది. సుకుమార్ స్క్రిప్ట్ మరియు టేకింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోనున్నారట. అక్కడ నేటివిటీకి సరిపోయేలా స్క్రిప్ట్ లో కూడా ఆయన చెప్పుకోదగ్గ మార్పులే చేస్తున్నారట. ఇక నిర్మాణ విలువల విషయంలో కాంప్రొమైజ్ కాకుండా, రిచ్ గా తెరకెక్కిస్తారట. మరో వైపు అల్లు అర్జున్ కూడా పూర్తి కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తుంది.

పాత్రకు తగ్గట్టుగా పూర్తి మేకోవర్ సాధించిన బన్నీ, నటన విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోనున్నాడట. తన డి గ్లామర్ లుక్, మరియు మాస్ కంట్రీ బాయ్ పాత్రకు తగ్గట్టుగా ఆయన తన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇక సినిమా నేపధ్యానికి తగ్గట్టుగా సాగే పాటలలో బన్నీ స్టెప్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. మొత్తంగా సుకుమార్, బన్నీ బాలీవుడ్ లో జెండా పాతడానికి పూర్తి సన్నద్ధం అవుతున్నారని వినికిడి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus