Sukumar: ఒక్కో సినిమాకి సుకుమార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే..?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఆయన.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో ఓ రేంజ్ లో ఆడింది. అక్కడ కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటింది. ఈ సినిమాతో సుకుమార్ ఇమేజ్ మారిపోయింది. దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ముందుగా రాజమౌళి ఆ తరువాత శంకర్ ఉన్నారు. ఇప్పుడు సుకుమార్ రెమ్యునరేషన్ విషయంలో టాప్ 2 ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తను డైరెక్ట్ చేసే సినిమాలకు రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా రూపంలో తీసుకుంటారు. ఆ విధంగా ఆయన రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు సుకుమార్ కి పెరిగిన క్రేజ్ తో ఒక్కో సినిమాకి రూ.40 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇదివరకు ఆయన ఒక్కో ప్రాజెక్ట్ కి రూ.16 నుంచి రూ.18 కోట్లు తీసుకునేవారు. ఇప్పుడు ఏకంగా డబుల్ ఛార్జ్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమా హిందీ మార్కెట్ సుకుమార్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి సహాయం చేస్తుందనే చెప్పాలి. ‘పుష్ప’ పార్ట్ 2కి సుకుమార్ కి రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే సుకుమార్ తన రెమ్యునరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus