Roshan: రోషన్‌ కనకాల సినిమా దర్శకుడు అతడేనట!

రాజీవ్ కనకాల – సుమ తనయుడు రోషన్‌ కనకాలను హీరోగా చేయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. దీని కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ.. అవేవీ సరిగ్గా వర్కవుట్‌ కాలేదు అని చెప్పొచ్చు. అయితే తాజాగా మరోసారి సుమ… సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ సారి కొత్త దర్శకుడు కాకుండా… కాస్త పేరున్న దర్శకుడితోనే తన కుమారుడిని తెరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు.

రోషన్‌ కనకాల హీరోగా ఓ సినిమా అనౌన్స్‌ చేశారు, అక్కడికి కొద్ది రోజులకు ఓపెనింగ్‌ కార్యక్రమం కూడా నిర్వహించారు. 2020 నవంబరులో దేవస్థానంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయ్‌ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా ఉంటుందని చెప్పారు కూడా. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. ఇప్పుడు కొత్తగా వేరే సినిమా చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చట.

‘ఉయ్యాలా జంపాలా’, ‘మజ్ను’ సినిమాలతో వైవిధ్యమైన ప్రేమకథల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. అంతేకాదు ‘ఆ!’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాలు చేసిన ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకు కథ అందిస్తున్నారని అంటున్నారు. అదిరిపోయే కాంబినేషన్‌ కదా ఇది. అందుకే సుమ ఈ ప్రాజెక్ట్‌ గురించి బలంగా ట్రై చేస్తున్నారట. విరించి వర్మ స్టైల్‌లోనే ఈ సినిమా కూడా క్యూట్ రొమాంటిక్ స్టోరీ అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్నగా మారింది. సుమ అడిగితే నో చెప్పే నిర్మాతలు ఉంటారు అనుకోవడం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే అంరితో స్నేహంగా ఉంటుంది సుమ. ఇక రాజీవ్‌ కనకాల కూడా ఎందరికో సుపరిచితుడు. ఈ పరిచయంతో సుమ తన కొడుకుని హీరో చేయాలని చూస్తున్నారట. చూద్దాం ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్‌ చేస్తారో. పనిలోపనిగా ఆ పాత సినిమా ఏమైందో కూడా తెలియొచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus