ఓ ఓటీటీలో ‘..కథలు’ పేరుతో ఓ షో ఉంది మీకు తెలిసే ఉంటుంది. అందులో రెగ్యులర్ కామెంట్లు కంటే కాస్త కాంట్రవర్శీ స్టేట్‌మెంట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ షో అలానే పాపులర్ అయింది కూడా. ఇప్పుడు ఆ షో కొత్త ఎపిసోడ్‌కి వచ్చిన నటుడు సుమంత్ కూడా ఇలాంటి మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన సరదాగా చెప్పిన కొన్ని విషయాలు.. ఆసక్తికరంగానే ఉన్నాయి.
ఈ క్రమంలో రోబోలా ఎందుకు ఉంటావు అని ఒకరు అడిగిన ప్రశ్న గురించి కూడా చెప్పాడు సుమంత్. హీరో సుమంత్ (Sumanth) ఇటీవల ‘అనగనగా’ (Anaganaga) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఓటీటీ షోకి వెళ్లారేమో కానీ.. ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ‘ఏంటి మీరు 20 ఏళ్ల నుండి చూస్తున్నా..
అలానే ఉన్నారు, సీక్రెట్ ఏంటి?’ అని యాంకర్ అడగ్గా ‘‘సీక్రెట్ అంటావేంటి.. ఏదో ఇంజక్షన్ పొడుచుకుంటున్నట్లు అడుగుతున్నావ్’’ అని సుమంత్ అన్నాడు. మీరేంటి? దేనికి రియాక్ట్ అవ్వరు? అని అమ్మాయిలు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఏడ్చారా? అని యాంకర్ అడగ్గా.. అసలు నీలో ఫీలింగ్ ఏది? ఎక్స్‌ప్రెషన్ ఎక్కడ? అలా రోబోలా ఎందుకుంటావ్? అని అనేవారని సుమంత్ చెప్పాడు. ఇక మీరు ఎవరితో డ్రింక్ చేస్తారు, ఎవరితో డ్యాన్స్ చేస్తారు అని యాంకర్ అడగ్గా..
తన చిన్న మామ అక్కినేని నాగార్జున (Nagarjuna) మామతో మందు తాగుతానని.. వెంకటేష్ (Venkatesh ) బావతో డ్యాన్స్ చేస్తానని సుమంత్ చెప్పారు. ఇక రిలేషన్‌షిప్ విషయంలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను సింగిలేనని, మింగిల్ కాలేదని తెలిపారు. త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కి వస్తుంది. అప్పుడు సుమంత్ గురించి, అతనితో పాటు వచ్చిన అవసరాలు శ్రీనివాస్ (Srinivas Avasarala) కూడా మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవన్నీ తర్వాత చూద్దాం.