ఎన్టీఆర్ బయోపిక్ కోసం సిద్ధమవుతున్న సుమంత్!

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై రోజురోజుకి క్రేజ్ పెరిగిపోతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని.. రెండో షెడ్యూల్ జరుపుకుంటోది. ఇందులో ఎన్టీఆర్  భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కనిపించనుంది. అలాగే కైకాల సత్యనారాయణ, నరేష్, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగా రానా అదరగొట్టనున్నారు. రీసెంట్ గా వచ్చిన అతని ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ షూటింగ్ లో సుమంత్ జాయిన్ కానున్నారు. అతను ఇందులో ఏఎన్నార్ కనిపించనున్నసంగతి తెలిసిందే. గతనెలలోనే ఈ విషయాన్ని వెల్లడించారు. “గొప్ప సినిమాలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. మా తాతగారు ఏఎన్నార్ రోల్ ని పోషించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని సుమంత్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు మరో విషయాన్ని చెప్పారు.

”ఎన్టీఆర్ బయోపిక్‌లో తాత అక్కినేని నాగేశ్వర్ రావుగా కనిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టా. మరికొద్ది వారాల్లోనే ఆయనలా మారిపోవడానికి సిద్దమవుతున్నా..” అంటూ సుమంత్ ట్వీట్ చేశాడు. దీంతో పాటు తాత అక్కినేని నాగేశ్వర్ రావుతో కలిసి తాను దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. సుమంత్ పెట్టిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ లుక్ ని చూడాలని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus