పెళ్లి గురించి వైరల్ అవుతున్న నటి సునైన కామెంట్స్..!

  • November 19, 2022 / 11:41 AM IST

నటి సునైన తానింకా బ్రేకప్ నుంచే కోలుకోలేకపోతున్నానని.. ఇక పెళ్లి గురించి ఎక్కడ ఆలోచిస్తానంటూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. 2005లో ‘కుమారి వర్సెస్ కుమారి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. చూడగానే పక్కింటి అమ్మాయిల అమాయకత్వంగా ఆకట్టుకునే రూపం సునైన సొంతం.. భాషతో సంబంధం లేకుండా తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిందామె. ఇటీవల యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు పక్కన ‘రాజ రాజ చోర’ చిత్రంలోనూ నటించింది.

తెలుగులో ఫస్ట్ సినిమాతో పోలిస్తే ‘రాజ రాజ’ నే తనకు గుర్తింపు తీసుకొచ్చింది. సునైన రీసెంట్‌గా సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. మీ పెళ్లెప్పుడు అని అడిగాడు.. దానికి సునైన.. నేనింకా బ్రేకప్ నుండే కోలుకోలేదు.. అని ఆన్సర్ ఇచ్చింది. ఇంకొకరు కష్టంగా అనిపించినప్పుడు ఏంచేస్తారని అడగ్గా.. ఈమధ్యే బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నాను..

బుక్ రీడింగ్ వల్ల రిలీఫ్‌గా అనిపిస్తోంది.. తెలుగులో మంచి ప్రాజెక్ట్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే, మీ దృష్టిలో విజయానికి నిర్వచనం ఏంటి అనడిగితే.. మీరు ఏదైతే కోరుకుంటారో.. అదే మీకు సంతోషాన్నిస్తుంది అని చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఆమె నటించిన ‘వండర్ ఉమెన్’ ఓటీటీ ప్లాట్ ఫాంలో సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. తమిళ్‌‌లో ‘రెజీనా’ అనే ఫిల్మ్ కంప్లీట్ చేసింది. అలాగే విశాల్ నటిస్తున్న‘ లాఠీ’ చిత్రంలోనూ కనిపించనుంది.

ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవనుంది. అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మిస్తుండగా.. నాని వాళ్ల అక్క డైరెక్ట్ చేస్తున్న ‘మీట్ క్యూట్’ అనే బ్యూటిఫుల్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus