సందీప్ కిషన్ ఆ హీరోయిన్ ను అక్కా అని పిలుస్తూ సెటైర్లు వేస్తున్నాడు..!

సినీ ఇండస్ట్రీలో దాదాపు హీరోయిన్లను.. హీరోలెవ్వరూ వరుసలు పెట్టి పిలవరు. మంచి స్నేహితులం .. ప్రాణ స్నేహితులం అంటూ చెప్పుకుంటారు కానీ… ‘అక్కా అనో’ ‘చెల్లి అనో’ అస్సలు పిలవరు. కానీ ఓ హీరో మాత్రం… హీరోయిన్ ను అక్క అని పిలుస్తున్నాడు. అంతేకాదు సెటైర్లు కూడా వేస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు మన సందీప్ కిషన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’. ఈ చిత్రం నవంబర్ 15న(ఈరోజు) విడుదల కాబోతుంది.

ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించగా తమిళ హీరోయిన్ వరలక్ష్మి కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని కూడా సందీప్ ప్రమోషన్లలో భాగంగా చెప్పుకొచ్చాడు. అయితే వరలక్ష్మి ని అక్క అని పిలుస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “వరలక్ష్మి నాకు మంచి ఫ్రెండ్ . తనని నేను అక్క అని పిలుస్తుంటాను. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తుంది. నిజానికి వరలక్ష్మి నాకంటే వయసులే చిన్నదే..! కానీ చూడ్డానికి మాత్రం పెద్దగా కనిపిస్తుంది. అందుకే అక్క అని పిలుస్తుంటాను. అక్క కనిపించగానే కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టేసి షూటింగ్ కి తీసుకెళ్తాను.ఇద్దరికీ అంత క్లోజ్ నెస్ ఉంది. నేను చాలా మందితో క్లోజ్ గా ఉంటాను. కానీ వరలక్ష్మితో ఇంకాస్త ఎక్కువ క్లోజ్ గా ఉంటాను. అందుకే ఆమెని ఎక్కువగా ఏడిపిస్తుంటాను” అంటూ కామెంట్స్ చేసాడు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus