రెజీనాతో తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన కుర్ర హీరో..!

‘ప్రస్థానం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు సందీప్ కిషన్. చోటా.కె.నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్.. తరువాత ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘బీరువా’ ‘టైగర్’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. సరికొత్త కథలు ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుస ప్లాపులు ఆయన్ని వెంటాడటంతో కోలీవుడ్ బాట పట్టాడు. అక్కడ అడపా.. దడపా సినిమాలు చేస్తూ మంచి పేరే సంపాదించుకున్నాడు. అప్పట్లో రకుల్ తోనూ ఆ తరువాత రెజీనా తోనూ ఈ కుర్ర హీరో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం జరిగింది. ముఖ్యంగా రెజీనాతో అయితే డేటింగ్లో ఉన్నాడని కూడా టాక్ నడిచింది. తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు సందీప్.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను సింగిల్. నా జీవితంలో ఏ అమ్మాయి లేదు. రెండేళ్ల క్రితం వరకూ ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఆ తరువాత ఆ రేలేషన్ కట్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు చెప్పడం తప్పు. ప్రస్తుతం ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి గడుపుతుంది… నా జీవితం నేను గడుపుతున్నాను. ఆమె పేరు మాత్రం నేను చెప్పలేను. విడిపోయిన వ్యక్తి గురించి చెప్పడం అంత కరెక్ట్ కాదు. ఇక హీరోయిన్ రెజీనాతో నాకు ఏదో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. మేమిద్దరం మంచి స్నేహితులం. ఈ రోజు ఉదయం కూడా ఫోన్ లో మాట్లాడుకున్నాం అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus