అమెజాన్ లో ‘మాయావన్’ సినిమాకు ప్రశంసల వర్షం..!

తమిళ నిర్మాత సి.వి.కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఇతను నిర్మించాడు అంటే కచ్చితంగా సినిమా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ‘పిజ్జా’ ‘పేట’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజు.. అలాగే ‘కబాలి’ ‘కాలా’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన పా.రంజిత్ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది సి.వి.కుమారే. ‘అట్టకత్తి’, ‘సూదుకవ్వుం’, ‘ఇండ్రు నేట్రు నాలై’, ‘ఇరైవి’ వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు.

అయితే దర్శకుడుగా మారి ‘మాయావన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.తానే నిర్మాత కాబట్టి.. కథ డిమాండ్ చేసినంత ప్రకారం సినిమాకి పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టేసాడు. కానీ ఆ స్థాయిలో బయ్యర్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చెయ్యలేదు. నాన్ థియేట్రీకల్స్ కూడా ఎక్కువగా రాలేదు. ఆ తరువాత మరో చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసాడు అది కూడా ఆడలేదు. ఆ టైములో ‘మాయావన్’ అనే చిత్రాన్ని నేను తెరకిక్కించడం వల్ల రోడ్డు మీదకు వచ్చేసాను అంటూ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు.

సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి కానీ డబ్బు మాత్రం రాలేదు. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తాజాగా అమెజాన్ లో విడుదల చేసారు. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అమెజాన్ లో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా సూపర్ అంటున్నారు. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ చిత్రానికి ఎక్కువ ప్రశంసలు దక్కాయి. మస్ట్ వాచ్ మూవీ అంటూ అందరూ స్టేటస్ లు పెడుతున్నారు. కనీసం వ్యూ టైం బట్టి అయినా కుమార్ కు డబ్బులు వస్తే బాగుంటుదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus