హీరోగా తనకు ఈమధ్యకాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతోపాటు.. ఆఫర్లు కూడా సరిగా రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నాడో లేక బాలీవుడ్ లో తన గ్యాంగ్ లోని హీరోహీరోయిన్లు కొందరు ఈ వెబ్ సిరీస్ లు చేస్తూ కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతుండడం చూసి ఇన్స్పైర్ అయ్యాడో తెలియదు కానీ.. ఉన్నట్లుండి సినిమా జర్నీకి కామా పెట్టి ఆన్ లైన్ జర్నీ మొదలెట్టాడు సందీప్ కిషన్. ఇదివరకూ తాను కూడా షార్ట్ ఫిలిమ్స్ చేసి, ప్రొడ్యూస్ చేసిన అనుభవం కూడా ఉండడంతో తనకు తెలిసిన ఒక దర్శకుడి నేతృత్వంలో అమేజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడట.
ఆల్రెడీ అమేజాన్ కోసం జగపతిబాబు ఓ వెబ్ సిరీస్ చేయగా అది కాస్త బోల్తా ఆకొట్టింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా భాషల్లోలా తెలుగులోనూ సక్సెస్ ఫుల్ వెబ్ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేయాలని నిశ్చయించుకొన్న అమేజాన్ ప్రైమ్ సంస్థ సందీప్ కిషన్ తోపాటు మరికొందరు ఫామ్ కోల్పోయిన హీరోలను కూడా వెబ్ కంటెంట్ వైపు లాగుతోందట. చూస్తుంటే.. ఇకపై సరైన సక్సెస్ లు లేకుండా ఇబ్బందిపడుతున్న యంగ్ హీరోలందరూ వెబ్ సిరీస్ లలో మెరుస్తారేమో అనిపిస్తుంది.