కృష్ణవంశీతో యంగ్ హీరో!

  • April 16, 2016 / 01:08 PM IST

గత కొంతకాలంగా కృష్ణవంశీ అనుకున్న పనులు జరగట్లేదు. తను చేయాలనుకున్న రెండు ప్రాజెక్ట్స్ చేజారిపోయాయి. బాలకృష్ణతో 100వ సినిమా చేయాలనుకున్నాడు. అది కాస్త క్రిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. బాలయ్యతో సినిమా చేయాలనుకొని ‘రుద్రాక్ష’ ప్రాజెక్టును పక్క పెట్టేశాడు. ఇప్పుడు ఆ సినిమా కూడా వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న కృష్ణవంశీ ఓ యువహీరోతో సినిమా చేసి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలో బిజీగా ఉన్నాడు. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో తనను అడిగిన వెంటనే ఓకే చెప్పేసాడు ఈ యంగ్ హీరో. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus