హోలి సంద‌ర్భంగా మార్చి 23న గ్రాండ్ లెవ‌ల్ విడుద‌ల‌వుతున్న `ర‌న్‌`

కెరీర్ తొలి నాళ్ళ నుండి డిఫరెంట్ మూవీస్ లో నటిస్తున్న హీరో సందీప్ కిషన్ హీరోగా, అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఏ టీవీ రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా మిష్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రన్’. విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టీజర్, కాన్సెప్ట్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. సినిమా ఎలా ఉంటుందోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో సంజు అనే పాత్ర సందీప్ కిషన్, అమ్ము పాత్రలో అనీషా అంబ్రోస్, వడ్డీ రాజా పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ లో టైమ్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగాయనే కథాంశాన్ని దర్శకుడు అని కన్నెగంటి చాలా టైట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారు. అన్ కాంప్రమైజింగ్ నిర్మాతలు సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను హోలి సంద‌ర్భంగా మార్చి 23న విడుదల గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు,
ఈ చిత్రానికి డైలాగ్స్: ప్రవీణ్, చీఫ్ కో డైరెక్టర్: సాయి దాసం, ఫైట్స్: విజయ్, కొరియోగ్రఫీ: రాజు సుందరం,సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, మ్యూజిక్: సాయికార్తీక్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర; దర్శకత్వం: అని కన్నెగంటి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus