కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న పూల రంగడు

హాస్య నటుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సునీల్.. హీరోగా ఎదిగాడు. మర్యాద రామన్న, పూల రంగడు వంటి విజయాలను సొంతం చేసుకున్నాడు. తర్వాత ఆయన హీరోగా చేసిన చిత్రాలన్నీ ఆశించినంతగా విజయం సాధించక పోవడంతో మళ్లీ పాత పద్ధతిని ఫాలో అయిపోతున్నాడు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమ రాయుడు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు తో మూవీ చేయనున్నారు.

అయితే లేటు అవుతుందని భావించిన పవన్… కాటమ రాయుడు షెడ్యూల్ గ్యాప్ లో రెండో చిత్రానికి డేట్స్ కేటాయించారు. నవంబర్ లో 15 రోజులపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో పని చేయనున్నారు. దీంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ వారు పనులను మొదలెట్టేసారు. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో పాటు ఆర్టిస్టుల ఎంపికను చక చక చేస్తున్నారు. తాజాగా ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ పాత్రకు సునీల్ ని ఎంచుకున్నట్లు తెలిసింది. పవర్ స్టార్ పక్కన పంచ్ లు పేల్చడానికి ఎప్పుడూ ఆలీ ని ఎంచుకునేవారు. ఈ సారి సునీల్ ఆ ఛాన్స్ కొట్టేసాడు. ఈ చిత్రం ద్వారా సునీల్ ని మళ్లీ కమెడియన్ గా బిజీ చేసేందుకు త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus