సునీల్ ఎఫైర్ నడుతున్న భామ ఎవరు?

సునీల్ మీద గుసగుసలు ఇండస్ట్రీ లో భారీగానే వినిపిస్తున్నాయి. అసలు సునీల్ కి హీరో వేషాలు వేస్ట్ అని, తన సినిమాల విషయం లో డైరెక్టర్ కన్నా ఎక్కువగా వేలు పెట్టి గెలుకుతుంటాడని, ఒక హీరోయిన్ తో ఎఫైర్ కూడా నడుపుతున్నాడని ఇంకా రకరకాల రూమర్స్ ఇండస్ట్రీ లో ఉన్నాయ్.తాజా తను ఒక యంగ్ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నడనే వార్త ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతుంది.ఐతే తన కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వీటన్నింటిపైనా క్లారిటీ ఇచ్చాడు సునీల్‌.

కమెడియన్ గా నటించేటప్పుడు డేట్స్ సర్దుబాటు చేసుకుని నటించేవాడినని, ఎవరికీ ఇబంది కలగకుండా డేట్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకొని నటించేవాడినని, ఎక్కడ తేడా వచ్చిన ఇబ్బందులు ఎదుర్కొనే వాడినని హీరో అయ్యాక ఆ బాధ తప్పిందని, ప్రశాంతం గా సినిమాలు చేస్తూ ఫ్యామిలి తో ఎక్కువ సమయం గడుపుతునానని చెప్పారు.

ఇక పోతే తను సినిమాల్ లో డైరెక్టర్ కన్నా ఎక్కువగా స్పందిస్తాడు అనే దానికి సమాదానం చెప్తూ ఒక సన్నివేశాన్ని అలా  కాకుండా ఇలా కూడా చెయ్యొచ్చని చెప్తే దానిని వేలుపెట్టడం అంటే ఎలా అని, హిట్ డైరెక్టర్ కి మాత్రమే కాదని తనకి కూడా అవసరమని, కాబట్టి కొంచం చొరవ తీసుకొంటున్నా అని అన్నారు. ఇక ఇషా చావ్లా తో తనకు ఎఫైర్ ఉంది అనే దానిపై స్పందిస్తూ’షూటింగ్‌ చేస్తున్నపుడు చుట్టూ ఉన్నవాళ్లతోనే కదా మాట్లాడాలి, ఓ డాక్టర్‌ మరో డాక్టర్‌ తో మాట్లాడితే అనుమానించేస్తారా? ఆ అమ్మాయితో నేను ఒకే సినిమా చేశా. మరో సినిమా అనుకోకుండా చేయాల్సి వచ్చింది అంటూ బదులిచ్చాడు’.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus