‘సునీల్’ కు ‘రాజమౌళి’ కలసి వస్తాడా???

టాలీవుడ్ ట్యాలెంటెడ్ కమీడియన్స్ లో ఒకడిన సునీల్ కమీడియన్ గా కరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా..హీరోగా మారిపోయాడు. అయితే తన హీరో కరియర్ అనేక ఒడిదుడుకుల మధ్య సాగుతున్నప్పటికీ, ఎక్కడా వెనుకాడకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణంలో సునీల్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణాష్టమి’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాష్టర్ ను చవి చూసింది.

అయితే ఎక్కడ వెనుకాడకుండా మరో సినిమా చేస్తున్నాడు సునీల్… అయితే ఈ సినిమా పుణ్యమా అంటూ సునీల్ రాజమౌళికి అనుకోని షాక్ ఇచ్చాడని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన. ఇంతకీ ఏమయ్యింది అంటే…సునీల్ హీరోగా  లేటెస్ట్ గా నిర్మాణంలో ఉన్న సినిమాకు ‘జక్కన్న’ అన్న టైటిల్ డిసైడ్ చేసారు. ప్రేమకథా చిత్రమ్ వంటి విజయవంతమైన సినిమా అందించిన సుదర్శన రెడ్డి ఈసినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాకు ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ముందే రెండు సినిమాలు తీసిన ఈ దర్శకుడికి పెద్దగా బ్రేక్ రాకపోవడంతో ఈ సినిమాపై కసితో పనిచేస్తున్నాడు . ఇక ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టడానికి ప్రధానం కారణం ఏంటి అంటే…హీరోగా సునీల్ కరియర్ పెద్దగా క్లిక్ కాకపోవడం, అంతేకాకుండా హీరోగా సునీల్ ను ఎస్ట్యాబ్లిష్ చేసిన రాజమౌళిని ముద్దుగా…జూనియర్ ఎన్టీఆర్ పిల్చుకునే ‘జక్కన్న’ పేరును ఈ సినిమాకు  టైటిల్ గా మార్చి ఈసినిమాకు క్రేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు జక్కన్న పేరు పెట్టడం వల్ల పరోక్షంగా రాజమౌళి సునీల్ సినిమాకు హెల్ప్ అవుతున్నట్లే. అంతేగామరి…ఒక్క ట్వీట్ తో ‘సంపూర్నెష్ బాబు’ ను హీరోగా చేసిన ఘనత మన జక్కన్నదేగా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus