సునీల్ ను మధ్యలోనే వదిలేసిన త్రివిక్రమ్.. కారణమేంటి?

ప్రస్తుతం త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘హారిక అండ్ హాసిని’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా పేతురేజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్, నవదీప్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన సునీల్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను సునీల్ చేయబోతున్నట్టు మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి.

‘అరవింద సమేత’ చిత్రంలో సునీల్ పాత్రని చాలా తగ్గించడం కారణంగా రీ ఎంట్రీలో.. తనకి రావలసిన గుర్తింపు అయితే రాలేదు. అందువలన బన్నీ సినిమాలో సునీల్ కోసం ఓ మంచి పాత్రను త్రివిక్రమ్ క్రియేట్ చేశాడని టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తుంది. మొదట ఈ చిత్రంలో రావు రమేశ్ .. సునీల్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండీ రావు రమేశ్ తప్పుకోవడంతో… ఆ ప్లేస్ లోకి హర్షవర్ధన్ వచ్చి చేరాడు. ఈ క్రమంలో ఆ సందర్భానికి తగినట్టు కొన్ని మార్పులు చేసాడంట త్రివిక్రమ్. దీంతో సునీల్ పాత్ర లేపేశాడట. సునీల్ కి .. అలాగే తన అభిమానులకి ఇది నిరాశను కలిగించే వార్తే అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus