Sunil: మళ్ళీ కామెడీ గేర్ వేయనున్న సునీల్.!

  • November 18, 2023 / 08:30 PM IST

సునీల్ కమెడియన్ గా సూపర్ సక్సెస్. తర్వాత హీరోగా కూడా మారాడు. అలా కూడా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ‘అందాల రాముడు’ ‘మర్యాద రామన్న’ ‘పూల రంగడు’ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ సునీల్ మార్కెట్ ను పెంచాయి.అవి సక్సెస్ అవ్వడానికి కారణం అందులో కామెడీ కూడా క్లిక్ అవ్వడం అనడంలో అతిశయోక్తి లేదు. కానీ సునీల్ మాత్రం తర్వాత కమర్షియల్ హీరోగా ఎదగాలి అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో అతనికి ప్లాపులు పడ్డాయి.

కొత్త హీరోల హవా కూడా ఎక్కువవడం.. సునీల్ ని రేసులో నుండి వెనక్కి నెట్టేసినట్లు అయ్యింది. అంతేకాకుండా ఫేడౌట్ అయిపోయిన దర్శకులు… సునీల్ కి బిస్కెట్లు వేసి ఛాన్సులు కొట్టడం మొదలుపెట్టారు. అది కూడా అతనికి మైనస్ అయ్యింది. మొత్తానికి ‘అరవింద సమేత’ తో సునీల్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈసారి కమెడియన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ వైపు మక్కువ చూపాడు. ఈ క్రమంలో ‘చిత్రలహరి’ ‘పుష్ప’ ‘కలర్ ఫోటో’ వంటి సినిమాలు ఇతనికి బాగా కలిసొచ్చాయి.

కానీ సునీల్ (Sunil) మార్క్ కామెడీ మిస్ అవుతుంది అనే అభిప్రాయం జనాల్లో ఉంది. కాబట్టి.. ఇప్పుడు చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా చేయబోతున్నాడట. చిరు – సునీల్ కాంబినేషన్ కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘జై చిరంజీవ’ ‘అందరివాడు’ సినిమాలు ఆడకపోయినా.. వాటిలో సునీల్ – చిరు కాంబినేషన్లో వచ్చే సీన్స్ హిలేరియస్ గా అనిపిస్తాయి. మరి ఈసారి ఎలా అలరిస్తారో చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus