బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది చెప్పలేని పరిస్థితి. లాస్ట్ టైమ్ కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ ఫ్రెండ్షిప్ గురించి కామెంట్స్ చేసినపుడు అనీమాస్టర్ బాగా ఫీల్ అయ్యింది. మానస్ వచ్చి సపోర్ట్ చేస్తున్నా కూడా ఓడుస్తూ ఏమోషనల్ అయ్యింది. అయితే, ఈసారి అనీమాస్టర్ కెప్టెన్సీ టాస్క్ లో సన్నీకి సపోర్ట్ చేసింది. అప్పుడు అన్నావ్ కదా డైలాగ్.. ఇది ఫ్రెండ్షిప్ అంటే అంటూ బెలూన్ ని పగలకొట్టే సూది ఇచ్చింది. దీంతో సన్నీ రవి బెలూన్ పగలగొట్టి బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు.
అంతేకాదు, తనకి సపోర్ట్ చేసిన అనీమాస్టర్ కి థ్యాంక్స్ చెప్తూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాడు. ఆ తర్వాత మళ్లీ అనీమాస్టర్ దగ్గరకి వచ్చి సెన్సార్ ఒప్పుకోదు కానీ మాస్టర్ అసలు లిప్ కిస్ పెట్టేసేవాడ్ని అంటూ సరదాగా జోకు వేశాడు. ఇక అనీమాస్టర్ చాలా సిన్సియర్ గా నీకు పే బ్యాక్ ఇవ్వాలని అప్పుడు ఈవిషయం చెప్పాలని అనుకున్నాను అని, అందుకే ఇప్పుడు ఇలా చేశానని చెప్పింది.
నిజానికి అంతకుముందే కెప్టెన్సీ పోటీదారుడికి సపోర్ట్ చేయడం కోసం హౌస్ మేట్స్ సూదిని పట్టుకుంటుంటే, నాకు సూది దొరికితే నీకు ఇచ్చి ఒక డైలాగ్ చెప్తానని సన్నీతో అనీమాస్టర్ చెప్పింది. దీంతో సన్నీ మేడమ్ మీరు ఇక్కడ కూర్చుంటే మీకు ఎలా దొరుకుంది అన్నట్లుగా మాట్లాడాడు. కానీ, లాస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సూది మాత్రం అనీమాస్టర్ కి దొరికింది. దీంతో అనీమాస్టర్ రవికి కాకుండా సన్నీకి సపోర్ట్ చేసి సన్నీని కెప్టెన్ ని చేయడంలో కీలకపాత్రని పోషించింది. అదీమేటర్.