వంద కోట్లకే కిందా మీదా పడుతుంటే.. ఏకంగా రూ.400 కోట్లు కొట్టాడు

ఇప్పుడున్న హీరోలు ఓ హిట్ కొట్టడానికే కిందా మీదా పడుతున్నారు. ఇప్పుడు సక్సెస్ అనేది ఫిలిం మేకర్స్ చేతిలో లేదు. జనాలు సినిమాని రిసీవ్ చేసుకోకపోతే స్టార్ హీరోల సినిమాలు కూడా వారం రోజులు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో ఫేడౌట్ అయిపోయిన హీరో వంద కోట్ల సినిమా ఇస్తాడు అని ఎవరైనా ఊహించగలరా.? అస్సలు ఊహించలేరు. అలాంటిది ఓ ఫేడౌట్ అయిపోయిన హీరో సినిమాకి ఏకంగా రూ.400 కోట్లు కలెక్షన్స్ నమోదయ్యాయి. ఇది చిన్న విషయం కాదు.

వివరాల్లోకి వెళితే.. సన్నీ డియోల్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’ 2001 లో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చింది. ఈ చిత్రానికి కూడా అనిల్ శర్మనే దర్శకుడు. ఈ చిత్రం రిలీజ్ కి ముందే భారీ హైప్ ను సొంతం చేసుకుంది.

దీంతో మొదటి రోజు ఈ చిత్రం (Gadar 2) భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. 2 వారాలు పూర్తి కావస్తున్నా.. ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ కలెక్షన్స్ తో ఈ మూవీ రూ.400 కోట్ల నెట్ మార్క్ ను టచ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుండటం విశేషం.

Top 10 Indian Box-office Day-1 Highest Grossing Collections 2023 Movies | Filmy Focus Originals

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus