Bigg Boss 5 Telugu: ఇద్దరి మద్యలో అసలు గొడవేంటి.. ? ఎందుకు చెడింది..?

  • November 1, 2021 / 12:24 PM IST

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా జరిగింది. నాగార్జున స్టేజ్ పైనుంచీ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనటీవీలో చూపించారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ సన్ ఫ్లవర్ టాస్క్ లో పాల్గొంటూ రెండు టీమ్స్ గా విడిపోయి పూరీలు చేశారు. సంచాలక్ గా కెప్టెన్ షణ్ముక్ ఉన్నాడు. ఇక్కడే ఫాస్ట్ గా చేసిన 50 పూరీలు చేసిన టీమ్ ని కాకుండా, చక్కగా తింటానికి వీలుగా చేసిన అనీమాస్టర్ టీమ్ ని గెలిచినట్లుగా ప్రకటించాడు సంచాలక్ షణ్ముక్. దీన్ని తప్పు బడుతూ సన్నీ మరోసారి టాస్క్ పేపర్ చదవమని షన్నూకి సలహా ఇచ్చాడు.

యానీ మాస్ట‌ర్, శ్రీరామ్‌, విశ్వ‌, ర‌వి, లోబో ఒక టీమ్ కాగా మిగిలిన‌వారంతా మ‌రో టీమ్‌ గా పూరీలు చేశారు. నిజానికి ఈ టాస్క్ లో కాజల్ టీమ్ ముందుగా 50 పూరీలు చేసిన‌ప్ప‌టికీ అవి స‌రిగా లేవంటూ సంచాల‌కుడు ష‌ణ్ను అనీమాస్టర్ టీమ్ ని విన్నర్ గా ప్రకటించాడు. ఇక్కడే లొల్లి స్టార్ట్ అయ్యింది. జైల్లో ఉన్న సన్నీ జడ్డిలాగా కాజల్ టీమ్ కష్టపడి పూరీలు చేశారని చెప్పాడు. టాస్క్ పేపర్ మరోసారి చూడమన్నాడు. దీంతో అనీమాస్టర్ సన్నీపై ఫుల్ ఫైర్ అయ్యింది. ఇద్దరికీ ఆర్గ్యూమెంట్ అనేది చాలాదూరం వెళ్లింది. సన్నీ మాటకి మాట చెప్తూ రెచ్చిపోతూ నోరు జారాడు.

అనీమాస్టర్ ‘బుద్ధుండాలి, మ‌ధ్య‌లో నీ జ‌డ్జిమెంట్ ఏంటి? న్యూట్ర‌ల్‌గా మాట్లాడు’ అని రెచ్చిపోయి సన్నీపైన విరుచుకుపడింది. ఈ ఆర్గ్యూమెంట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే వరకూ వెళ్లిపోయింది. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ ఆర్గ్యూమెంట్ లో రవి, మానస్, శ్రీరామ్, కాజల్ కూడా ఇన్వాల్ అయిపోయి అరుచుకున్నారు.ఇక్కడ అందరూ అరచుకుంటుంటే కెప్టెన్ షణ్ముక్ మాత్రం నవ్వుతూ అందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కూర్చున్నాడు. దీన్ని కూడా తప్పుబట్టాడు సన్నీ. కొందరు ఆవేశంగా బాధపడుతూ మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తోందా అంటూ నిలదీశాడు. సన్నీ మాటలని అస్సలు పట్టించుకోలేదు షణ్ముక్.

అరిచినవాళ్ల నోరు బయటపడుతుందులే అంటూ చిరునవ్వు చిందిస్తూ బయటకి వచ్చి కొడతావా కొట్టు అంటూ మరింత రెచ్చగొట్టాడు షణ్ముక్. ఇద్దరి మద్యలో మరోసారి హీటెడ్ ఆర్గ్యూమెంట్ అనేది జరిగింది. నిజానికి షణ్ముక్ కి , సన్నీకి అంతకుముందే ఆర్గ్యూమెంట్ అనేది అయ్యింది. ఫిజికల్ గా నువ్వు వెల్లావ్ అందుకే నేను నిన్ను జైలుకు పంపిస్తున్నా అని చెప్పినపుడే సన్నీ బాగా ట్రిగ్గర్ అయ్యాడు. సన్నీ షణ్ముక్ విషయంలో చాలా పర్సనల్ గా తీస్కున్నాడు.

అందుకే ఇద్దరి మద్యలో గట్టి ఆర్గ్యూమెంట్ అనేది అయ్యింది. ఇదంతా చూస్తూ స్టేజ్ పైన హౌస్ మేట్స్ కి వెల్కమ్ చెప్తూ అందరికీ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు హోస్ట్ నాగార్జున. ఇక్కడ షణ్ముక్ ని కేవలం కెప్టెన్ అయినందుకు పొగడటం అనేది గమనార్హం. అంత గొడవలో కూడా షణ్ముక్ కెప్టెన్ గా ఎందుకు ఆపడానికి ట్రై చేయలేదు అనేది కూడా నాగార్జున అడగలేదు. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus