బిగ్ బాస్ హౌస్ లో మాములు సీరియల్ ఆర్టిస్ట్ గా విజె సన్నీగా ఎంటర్ అయిన సన్నీకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వస్తోంది. ఎక్కడ చూసినా గ్రూప్స్ లో సన్నీ వీడియోలు, ఫోటోలు షేర్ అవుతున్నాయి. అసలు గేమ్ లో సన్నీకి ఎందుకిలా క్రేజ్ వచ్చింది ? మిగతా కంటెస్టెంట్స్ కి రాని ఈ క్రేజ్ సన్నీకి మాత్రమే రావడానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, ఫస్ట్ వీక్స్ లో సన్నీ తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్లాడు. ఎప్పుడైతే బ్యాడెన్ టాస్క్ లో సిరి టీషర్ట్ లో చెయి పెట్టడు అంటూ ఎలిగేషన్ వచ్చిందో వీకెండ్ అది తప్పని ప్రూవ్ అయ్యింది. షణ్ముక్ కూడా సన్నీకి సారీ చెప్పాడు.
ఇక్కడ్నుంచీ సన్నీ గేమ్ హైప్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వేటగాడు టాస్క్ లో నామినేషన్స్ అప్పుడు సన్నీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రియా వచ్చి టవర్ సోఫాపై రవి ఆడేశాడు నామినేట్ చేయి అన్నప్పుడు, సన్నీ నాతోనే గేమ్స్ ఆడుతున్నారా.. నా గేమ్ ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ ప్రియా నామినేషన్ ని యాక్సెప్ట్ చేశాడు. రవిని నామినేట్ చేశాడు. అయితే, అక్కడ తను శ్వేత విషయంలో చేస్తున్నానని, ఈ రీజన్ కి చేయట్లేదని ఇది నా గేమ్ స్టైల్ అంటూ చెప్పాడు సన్నీ. ఇక్కడ్నుంచీ సన్నీ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రతి టాస్క్ లో తన గేమ్ ని వ్యూవర్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, మిగతా హౌస్ మేట్స్ సన్నీని టార్గెట్ చేయడం అనేది కూడా సన్నీకి బాగా ప్లస్ అయ్యింది.
ముఖ్యంగా శ్రీరామ్ చంద్ర కెప్టెన్ అయినపుడు సన్నీకి ఎక్కువమంది హౌస్ మేట్స్ కత్తిపోట్లు దింపారు. హౌస్ మేట్స్ కత్తులు బలంగా దింపితే సోషల్ మీడియాలో ధృడంగా ఎదిగాడు సన్నీ. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం సన్నీకి పాజిటివ్ గా మాట్లాడటం బాగా ప్లస్ అయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉన్న షణ్ముక్ సిరితో టైమ్ పాస్ చేయడం, వాళ్లు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం అని చెప్పడం కూడా సన్నీకి బాగా ప్లస్ అయ్యింది. ఇక రీసంట్ గా సిరితో అయిన గొడవలో నాగార్జున సన్నీకి యాంటీ అవ్వడం, జైల్లో దోషిగా పెట్టి రవి సన్నీని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది సన్నీ గేమ్ కి క్రేజ్ ని తీస్కుని వచ్చింది.
ఆ తర్వాత గిల్టీ బోర్డ్ తో హౌస్ లో తిరగడంతో ఆడియన్స్ దిమ్మతిరిగే ఓటింగ్ వేశారు. ఒక్కసారిగా అన్ అఫీషియల్ సైట్స్ లో 15 నుంచీ 25 శాతం వరకూ ఓటింగ్ పెరిగిపోయింది. దీంతో సన్నీకి సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది. ఇక నామినేషన్స్ అప్పుడు సన్నీని టార్గెట్ చేయడం, మిగతా టాస్క్ లలో సన్నీ ద బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడం అనేది కూడా బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నాగార్జున సన్నీకి యాంటీ అవ్వడం అనేది సోషల్ మీడియాలో అతడ్ని హీరోని చేసేసింది. ఆ తర్వాత వారం నాగార్జున సన్నీ గేమ్ ని మెచ్చుకోవడంతో సన్నీ గ్రాఫ్ ఫుల్ గా పెరిగింది. మొత్తానికి ప్రస్తుతం టైటిల్ రేస్ లో నిలబడ్డాడు సన్నీ. ఇలాగే మరో రెండు మూడు వారాలు ఉంటే ఈసీజన్ విన్నర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదీ మేటర్.