రాజ‌శేఖ‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌`లో స‌న్నిలియోన్‌

అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నచిత్రం “పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌“. ఇది వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు రాజశేఖ‌ర్‌ను స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త‌గా ప్రజెంట్ చేస్తున్నాడ‌ని, క‌చ్చితంగా రాజ‌శేఖ‌ర్‌కు ఇది కంబ్యాక్ ఫిలిం అవుతుంద‌ని అంటున్నారు.

శృంగార తార సన్నిలియోన్ గ‌రుడ వేగ‌లో ఓ ప్రత్యేక‌మైన సాంగ్‌లో న‌టిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ముంబై ఫిలింసిటీలో ఈ పాట కోసం వేసిన భారీ సెట్టింగ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. `గందిబాత్‌…`, `రాం చాహే లీల చాహే…` వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా ఈ పెప్పి బీట్‌కు న‌త్య‌రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఇంత‌కు ముందు తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందించిన‌ విష్గ్ణుదేవా చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో మాస్ నంబ‌ర్‌కు కొరియోగ్ర‌ఫీ చేయ‌నున్నారు.

చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది. జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం`పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌`ను నిర్మాత‌లు ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌కుండా రూపొందిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus