యువ కథానాయకులే ఎంత ఫాస్ట్ గా సినిమా చేస్తున్నా.. తమ సినిమాల రిలీజ్ ల నడుమ కనీసం మూడు నాలుగు నెలల గ్యాప్ ఉండేలా జాగ్రత్త తీసుకొంటారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే నాని, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ ఫార్ములాను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. కానీ.. రజనీకాంత్ ఎందుకు తొందరపడ్డారో తెలియదు కానీ.. తన సినిమాలను కేవలం నెలన్నర రోజుల గ్యాప్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన కథానాయకుడిగా నటించిన క్రేజీయస్ట్ ఫిలిమ్ “రోబో 2.0” నవంబర్ 29న విడుదలకు సిద్ధమవుతుండగా.. తన తదుపరి చిత్రమైన “పెట్ట”ను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేశాడు.
కానీ.. రజనీకాంత్ కి ఉన్న స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొన్న డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు రజనీ సినిమాలకు కనీసం రెండున్నర నెలల గ్యాప్ ఉండడం ఉత్తమం అని భావించడంతో.. “పెట్ట” చిత్రాన్ని సంక్రాంతి బరి నుంచి తప్పించడంతోపాటు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారట. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో విశేషమైన అంచనాలున్నాయి. ఇప్పటివరకు రజనీ వర్క్ చేసిన డైరెక్టర్స్ లో యంగెస్ట్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కావడమే అందుకు కారణం. ఇకపోతే.. నవంబర్ 29న విడుదలకనున్న “రోబో 2.0″పై భారీ అంచనాలున్నాయి. మరి సినిమా ఆ అంచనాలను చేరుకోగలుగుతుందో లేదో చూడాలి.