రజనీ కూడా అదే బాటలో..?

ప్రస్తుతం రాజకీయ పార్టీలకి ప్రజల అండదండలు ఉన్నా.. లేకపోయినా.. మీడియా సపోర్ట్ మాత్రం కచ్చితంగా ఉండాలి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రతీ రాజకీయ పార్టీ సభ్యులు తమకు మీడియా సపోర్ట్ ఉండేలాగానే చూసుకుంటున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘జనసేన పార్టీ’ కి సంబంధించి ఓ ఛానల్ ను స్థాపించనున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా రాజకీయాల పై దృష్టి సాధిస్తున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఈ మార్గాన్ని ఎంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. విషయాన్ని గమనిస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మీద త్వరలో రజినీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ అనే మూడు ఛానల్స్ తమిళనాడులో రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీటికి సంబంధించిన లోగోలు కూడా రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ ఛానెల్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ‘మక్కల్ మందిరం’ పార్టీకి రజనీ పెట్టబోతున్న ఈ చానెల్స్ ఎంతవరకు ఉపయోగపడతాయనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా రజనీ నటించిన తాజా చిత్రం ‘పెట్టా’ విడుదలకు ముస్తాబవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus