వీరి సపోర్ట్ తో సినిమా హిట్

  • July 29, 2016 / 01:02 PM IST

కీలకమవుతున్న సహాయ పాత్రలు సినిమా విజయానికి సపోర్ట్

సినిమాల్లో హీరో, విలన్ పాత్రలు అందరికి గుర్తుంటాయి. ఎందుకంటే ఎక్కువగా వీరే కనిపిస్తారు… వీరిద్దరి చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. అందుకే వీరికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమాలో సహాయ పాత్రలు కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోతున్నాయి. ఈ క్యారెక్టర్లపై దర్శకులు దృష్టి పెట్టడంతో పాటు… హీరోలు చేయడానికి ముందుకు వస్తుండడంతో .. నేటి సినిమాల్లో ఇలాంటి పాత్రలు కీలక మవుతున్నాయి. సపోర్టింగ్ రోల్స్ చిత్ర విజయానికి కూడా సపోర్ట్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకున్నకొన్ని సపోర్టింగ్ రోల్స్ గురించి..

గాలి శీను
గమ్యం సినిమాలో చిల్లర దొంగతనాలు చేస్తూ గాలికి తిరిగే గాలి శీను పాత్రలో నరేష్ కామెడీనీ పండించాడు. హీరో అభి తను ప్రేమించిన జానకిని వెతికే ప్రయాణంలో గాలి శీను తోడవుతాడు. మిత్రుడవుతాడు. దొంగ మంచి వాడు అవుతాడు. చివరికి చనిపోయి కన్నీరు పెట్టించాడు. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ కంటే నరేష్ కే బాగా పేరు వచ్చింది. ఈ పాత్రకు గాను నరేష్ బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

షేర్ ఖాన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చిత్రం మగధీర. ఇందులో కొద్దిసేపు షేర్ ఖాన్ గా కనిపించినా అసమాన నటనతో శ్రీహరి గుర్తుండి పోయాడు. కాల భైరవ (రామ్ చరణ్) ప్రాత పోరాట పటిమకు సలాం చేసే సన్నివేశం సినిమాల్లోని మంచి సీన్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా నుంచే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సపోర్టింగ్ రోల్స్ పై దృష్టి పెట్టారని చెప్పాలి

శివ

నేటి ప్రేమ కథలకు అద్దంగా నిలిచినా చిత్రం ఇష్క్. ఇందులో అజయ్ “శివ” గా నటించాడు. చెల్లి బాగుకోరే అన్నలా, ప్రేమించే భర్తలా, తండ్రికి మంచి కొడుకుగా, తనను దెబ్బ కొట్టిన వాడికి బుద్ధి చెప్పాలనే తాపత్రయ పడే శత్రువుగా.. ఒకే పాత్రలో నాలుగు షేడ్స్ చూపించి శెభాష్ అనిపించుకున్నాడు. హీరో నితిన్, హీరోయిన్ నిత్య మీనన్ కి సరిసమానంగా అజయ్ తెరపై కనిపించి అలరించాడు.

మల్లమ్మ

కింగ్ నాగార్జున నటించిన హిస్టారిక్ ఫిల్మ్ “రాజన్న”. ఇందులో ఎంతోమంది సీనియర్ నటులు నటించినా “మల్లమ్మ” పాత్ర చేసిన యానీ అందరికీ గుర్తుండి పోయింది. రాజన్నబిడ్డగా ఈ చిన్నారి పలికించిన అభినయం ప్రసంశలు అందుకుంది. “అమ్మ అవనీ” అనే పాటతో మల్లమ్మ బిడ్డగా మహిళా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

దేవా

మిర్చి. ప్రభాస్ కి చాలా తీపైన విజయాన్ని అందించిన సినిమా. ఇందులో ఊరి బాగుకోసం కట్టుకున్న భార్యకు, కన్న బిడ్డకు దూరమైన “దేవా” పాత్రలో తమిళ నటుడు సత్యరాజ్ జీవించాడు. హీరో తండ్రిని కొన్ని మాటలకే పరిమితం చేయకుండా దర్శకుడు కొరటాల శివ దేవా పాత్రను సినిమాకు కీలకం చేసాడు. ఆ బాధ్యతను సత్యరాజ్ చక్కగా నిర్వర్తించి చిత్ర విజయానికి దోహద పడ్డాడు.

కిల్ బిల్ పాండే

ఓ వైపు యాక్షన్ నడుస్తుండగా నవ్వు తెప్పించడంలో డైరక్టర్ సురేందర్ రెడ్డి విజయం సాధించాడు. రేసుగుర్రం సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ లో కిల్ బిల్ పాండే పాత్రతో కిరాక్ పుట్టించాడు. కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మనందం విశ్వరూపం చూపించాడు.అతను కనిపించే కొన్నినిముషాలు చాలా వేగంగా నడుస్తాయి. హీరో అల్లు అర్జున్ ఆర్డర్ పై రెచ్చిపోయే పోలీస్ ఆఫీసర్ పాత్ర తలుచుకుంటేనే నవ్వు వస్తుంది.

మూర్తి

లౌడ్ కామెడీ సృష్టించడంలో ఆరితేరిన నటుడు పోసాని కృష్ణ మురళి. ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాలో ఇతను మూర్తి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు ప్రాణం పోశాడు. తన మాటలతో హీరోలోనే మార్పు తెస్తాడు. “మూర్తి గారు” అంటూ సినిమాలో హీరో చేత ఎక్కువ సార్లు పిలిపించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ పాత్ర విలువను తెలియ జెప్పాడు. చిత్ర బృందం అనుకున్నట్లు గానే మూర్తి పాత్ర గుర్తింపు సాధిందింది.

శివగామి, కట్టప్ప

తెలుగు ప్రజలు గర్వించ దగ్గ సినిమా బాహుబలి. ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివ), భళ్ళాల దేవా తర్వాత గుర్తుకు వచ్చే పాత్రలు శివగామి, కట్టప్ప. రమ్యకృష్ణ శివగామి పాత్రలో రాజసం చూపించారు. యువ రాజులను పరాక్రమ వంతులుగా తీర్చిదిద్దే తల్లిగా ఆమె నటన అజరామరం. పూర్వీకులు ఇచ్చిన మాటకు కట్టుబడిన సైన్యాదక్షుడు కట్టప్పను మరిచి పోలేము. ఈ పాత్రతో సత్యరాజ్ కి మంచి పేరు వచ్చింది. శివగామి, కట్టప్ప పాత్రలు బాహుబలి సినిమా విజయానికి పిల్లర్లుగా నిలిచాయి.

గోనగన్నారెడ్డి

చరిత్రను చదువుతుంటే మనకి తెలియకుండానే కొందరికి అభిమానులమైపోతాము. అటువంటి వారిలో గోన గన్నారెడ్డి ఒకరు. రుద్రమ దేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపింఛి అదరహో అనిపించాడు. ఆ పాత్రను మరింత పవర్ ఫుల్ చేసాడు. ఒక స్టార్ అయివుండి.. రుద్రమ దేవి సినిమాలో సపోర్టింగ్ పాత్రను అద్భుతంగా పోషించి అభినందనలు అందుకున్నాడు.

పాలెం వెంకన్న

ఈ సంవత్సరం సమ్మర్ హిట్ గా నిలిచిన సినిమా “అ..ఆ”. ఇందులో కూతురిని అతి ప్రేమగా పెంచే తండ్రి పాలెం వెంకన్నమన పక్కింటి వ్యక్తిలా అనిపిస్తాడు. ఈ పాత్రలో రావు రమేష్ సహజంగా నటించి సినిమాకు ప్లస్ అయ్యాడు. తనకే సొంతమైన స్లాంగ్,మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. సినిమా మొదట నుంచి అతన్ని అసహ్యించుకున్నా.. క్లైమాక్స్ సీన్లో నవ్వులు పూయించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus