సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా,బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘సుప్రీమ్’. మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో అన్నీ ఏరియాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఈ సినిమాలో దివ్యాంగులు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సీన్స్ లో నటించిన ఆనంద్ అండ్ టీంను ఇటీవలే చిత్ర బృందం సత్కరించారు. అలాగే, దివ్యాంగుల కోసం ఒక స్పెషల్ షో ను ప్రసాద్ లాబ్స్ లో వేసి, సుప్రీమ్ చిత్ర బృందం వారితో ఆనందాన్ని పంచుకుంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘’సుప్రీమ్ సక్సెస్ లో హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు అనిల్ లకే క్రెడిట్ ముఖ్య భాగమైనప్పటికీ వీరితో పాటు మికెల్ గాంధీ నటన, క్లైమాక్స్ ఫిజికల్ చాలెంజ్ వ్యక్తులు చేసిన ఫైట్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఓటమిని కూడా గెలుగుపుగా మార్చుకోవచ్చు అనే ఓ మెసేజ్ ను ఈ సినిమా ద్వారా అందించాం. ఈ మెసేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే దివ్యాంగులు అందరికీ చేరాలి అనే ఉద్దేశం తో, వారికి ఈ చిత్రాన్ని ఫ్రీ గా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాం.
ఈ శుక్రవారం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఏ సింగల్ స్క్రీన్ ధియేటర్ కి అయినా సరే, దివ్యాన్గులు తమ తో పాటు ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ‘సుప్రీమ్’ చిత్రాన్ని ఫ్రీ గా చూడొచ్చు ” అని అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘’ఈ చిత్రం విజయం నాకెంతో త్రుప్తి ని ఇచ్చింది. ముఖ్యం గా, ఎంతో పోరాట పటిమ తో జీవితాన్ని ఎదుర్కునే దివ్యాంగులు ఈ చిత్ర విజయం లో భాగం కావటం నాకు చాలా త్రుప్తి ని ఇచ్చింది ’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘’ దివ్యాంగుల ఫైట్ లో నటించిన ఆనంద్ అండ్ టీం కు నా ధన్యవాదాలు. ఎలాంటి పరిస్థితి అయినా మనోధైర్యం తో ఎదుర్కోవచ్చు అనేది పది మందికీ చెప్పాలనేదే మా ఉద్దేశం. ఇవాళ ఈ ఫైట్ ఇంత పాపులర్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ప్రసాద్ లాబ్స్ లో దివ్యాంగుల కోసం వేసిన సుప్రీమ్ షో లో, ఆ ఫైట్ చూస్తున్నప్పుడు వారి ఆనందాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము ’’ అన్నారు. దర్శకత్వం – స్క్రీన్ప్లే – అనిల్ రావిపూడి. రచనా సహకారం – ఎస్. కృష్ణ. సినిమాటోగ్రఫీ – సాయి శ్రీరామ్ . ఆర్ట్ – ఏ .ఎస్ ప్రకాష్ – ఎడిటర్ – ఎమ్ అర్ వర్మ . సంగీతం – సాయి కార్తీక్ . నిర్మాత – శిరీష్ . సమర్పకులు – దిల్ రాజు