Supritha: సుప్రీతతో పదే పదే ముద్దులు పెట్టించుకున్నారట!

సినిమా అయినా.. మ్యూజిక్ ఆల్బమ్స్ అయినా షూటింగ్ సమయంలో చాలా టెక్స్ తీసుకుంటూ ఉంటారు. అది చాలా కామన్. సీన్ ఎలాంటిదైనా.. దర్శకుడికి నచ్చేవరకు ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూనే ఉంటారు. అయితే రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాలు కూడా నటనలో భాగమే. కాబట్టి డేనీ మినహాయింపు ఉండదు. కొత్త నటీనటులైతే ఇలాంటి సన్నివేశాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత విషయంలో కూడా అదే జరిగిందట.

ఓ సీన్ కోసం ఆమెతో మళ్లీ మళ్లీ ముద్దులు పెట్టించుకున్నారట. ఈ విషయాన్ని సుప్రీత స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కెమెరా ముందుకు రాకుండానే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుప్రీత. తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రమంలో తొలిసారి ఆమె కెమెరా ముందుకొచ్చింది. కాకపోతే అది సినిమా కాదు.. ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది ఈ బ్యూటీ.

ఇద్దరు ప్రేమికుల మధ్య ఎమోషన్స్ తెలిసేలా ‘వెళ్లిపో’ అనే పేరుతో ఈ ఆల్బమ్ ను చిత్రీకరించి వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేశారు. ఇందులో సుప్రీత సరసన ర్యాప్ సింగర్ రాకీ జోర్దాన్ నటించాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత ఈ సాంగ్ కి సంబంధించిన విషయాలను పంచుకుంది. ఈ సాంగ్ లో ముద్దు సన్నివేశాలు చాలా కష్టంగా అనిపించాయని.. ఆ టేక్ తనతో మళ్లీ మళ్లీ చేయించుకున్నారని..

రెండు రోజుల పాటు ఆ సన్నివేశాన్ని షూట్ చేశారని తెలిపింది. లైఫ్ లో ఈ హగ్గులు, కిస్సులు ఎప్పుడూ లేవని అందుకే చాలా ఇబ్బందిగా అనిపించిందంటూ సుప్రీత చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus