Surekha, Ram Charan: రామ్ చరణ్ బర్త్ డేకు సురేఖ ఇచ్చిన మెమరబుల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ (Ram Charan)  పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చరణ్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగేలా చరణ్ అభిమానులు ప్లాన్ చేసుకుంటున్నారు. చరణ్ పుట్టినరోజుకు ఒకరోజు ముందే తల్లి సురేఖ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. తన స్వహస్తాలతో వండిన వంటకాలను సురేఖ 500 మంది భక్తులకు ఉపాసన చేతుల మీదుగా వడ్డించారు. అత్తామ్మాస్ కిచెన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.

అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయంలో పుష్కరోత్సవం జరుగుతుండగా ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులకు చరణ్ పుట్టినరోజు సందర్భంగా రుచికరమైన వంటకాలను వడ్డించి సురేఖ తల్లి మనస్సును చాటుకున్నారు. చరణ్ పై సురేఖ ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చరణ్ పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే మొదలు కావడం గమనార్హం.

మరోవైపు గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా నుంచి విడుదలవుతున్న జరగండి సాంగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సాంగ్ హిట్ కావడం థమన్ కు (S.S.Thaman) ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. సాధారణంగా ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా మేకర్స్ రిలీజ్ చేస్తారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత చరణ్ సినిమాల లైనప్ బాగుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దిల్ రాజు(Dil Raju), శంకర్ (Shankar)   ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితం సినిమాలో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చరణ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ సినిమాగా నిలవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus