Surekha Vani: కూతురికి మందు తాగించిన సురేఖ.. తిట్టి పోస్తున్న నెటిజన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ఎన్నో తెలుగు సినిమాలలో ఒక తల్లిగా, చెల్లిగా, పిన్ని, వదిన పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా వివిధ సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించిన ఈమె ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇకపోతే తన భర్త మరణం తర్వాత కొద్ది రోజులపాటు కృంగిపోయిన సురేఖ వాణి ప్రస్తుతం తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు.

ఇకపోతే కరోనా లాక్ డౌన్ సమయంలో సురేఖవాణి ఇంస్టాగ్రామ్ లోకి ఎంటర్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా తన కూతురు సుప్రీతను పరిచయం చేయడమే కాకుండా ప్రస్తుతం ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో వివిధ రకాల డాన్స్ వీడియోలతో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.నిత్యం గ్లామరస్ ఫోటోషూట్ లు నిర్వహించడమే కాకుండా ఎన్నో రీల్స్ చేస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి హాలిడే వెకేషన్ కోసం వివిధ దేశాలకు వెళుతూ పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడం ఎంజాయ్ చేయడం చేస్తున్నారు.

ఇలా ఈ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో కొన్నిసార్లు నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. తాజాగా సురేఖ వాణి మరోసారి నేటిజెన్ల ఆగ్రహానికి గురయ్యారు. సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు సురేఖ వానిపై తిట్ల దండకం మొదలుపెట్టారు.

అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సురేఖవాణి తన కూతురుకు ఏకంగా మద్యం తాపించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.ఇది చూసిన ఎంతోమంది నెటిజెన్లు అసలు నువ్వు తల్లివేనా ఇలా దగ్గరుండి కూతురికి మందు తాపుతావా అంటూ పెద్ద ఎత్తున ఈమెను ఏకీ పారేస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!


సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus