యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం వచ్చింది. ట్రైలర్ ఏప్రిల్ 18న విడుదలవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాకినాడలో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది ఏజెంట్ చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో ఏజెంట్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ఏజెంట్ మోస్ట్ మెమరబుల్ జర్నీ. మెంటల్ గా ఫిజికల్ గా నా జీవితాన్ని మార్చిన చిత్రమిది. ‘నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను ,మీరు పడాలి’ అని సురేందర్ రెడ్డిగా నాకు ముందే చెప్పేశారు. ఆ రోజే ఆయనకి మాటిచ్చాను. ఆ ప్రామిస్ తో సినిమా పూర్తి చేశాం. ఈ రోజు నేను కొత్తగా కనిపిస్తున్నానంటే కారణం సురేందర్ రెడ్డి గారే. ఆయన నన్ను ఇలా ఇమాజిన్ చేసి చూపించారు. నేను ఆయన్నే ఫాలో అయ్యాను. ఆయన పూర్తి న్యాయం చేశారు. ఏజెంట్ జర్నీ చాలా తృప్తిని ఇచ్చింది. ఏజెంట్ మానసికంగా బలాన్ని ఇచ్చింది. ఈ జర్నీలో చాలా మంది భాగమయ్యారు. సాక్షి చాలా చక్కగా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మరెన్నో అవకాశాలు వస్తాయి. మమ్ముటీ గారు నా స్ఫూర్తి. ఆయనతో వర్క్ చేయడం వెరీ మెమరబుల్. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. రసూల్ గారు సినిమా టోన్ కి బ్యాక్ బోన్. ఏజెంట్ జర్నీ క్రేజీగా వుండింది. క్యారెక్టర్ వైల్డ్ గా వుండింది. ‘ఏజెంట్’ హై ఆక్టేవ్ రోలర్ కోస్టార్ రైడ్.. థియేటర్ లో హై మాములుగా వుండదు. ఈ క్రేజీ నెస్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇలాంటి సినిమాని అనిల్ గారు లాంటి నిర్మాతలే చేయగలుతారు. ఏజెంట్ తో ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నామని ఆయన మొదటి రోజు నుంచి చెప్పారు. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సినిమాకి కష్టపడ్డామని చెబుతుంటాం. కానీ ఏజెంట్ లో మాత్రం బాగా కష్టపడింది అఖిల్ గారే. ఏడాదిన్నరగా సినిమా చేస్తున్నాం. ప్రతి రోజు వుంటారు. ఏడాదిన్నర పాటు బాడీ మెంటైన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఒక్క రోజు కూడా అలసట చెందలేదు. చాలా డెడికేటడ్ గా చేశారు. అనిల్ సుంకర గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. మా వెనుక వుండి నడిపించారు. ఈ సినిమాలో మరో హైలెట్ మమ్ముటి గారు. ఆయన గొప్పగా సహకారం అందించారు. ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చారు. ఆయనతో పని చేయడం ఒక అదృష్టం. డినో ఇందులో చాలా కొత్తగా వుంటారు. సాక్షి చాలా చక్కగా చేసింది. తనకి పెద్ద ఫ్యూచర్ వుంది. ఈ సినిమా లుక్ ఇంత బాగా వచ్చిందంటే అది రసూల్ గారి వల్లే జరిగింది. షూటింగ్ జాలీగా జరిగింది. ఏప్రిల్ 28 న సినిమా వస్తోంది. మీ అందరి సహకారం కావాలి. ఏజెంట్ ప్రేక్షకులు, అభిమానులు అంచనాలు తగ్గట్టు వుంటుంది. అఖిల్ ఇప్పటివరకూ చేసింది ఒకెత్తు ఏజెంట్ మరో ఎత్తు. అఖిల్ అన్ని చేయగలుగుతాడు. నేను ఒక యాభై శాతం మాత్రమే తీసుకోగాలిగాను. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళేది అఖిల్ నే. ఈ సినిమా అఖిల్ కోసమే చేశాను. వందశాతం న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అఖిల్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాని గర్వంగా చెబుతున్నాను ’అన్నారు
అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఏజెంట్ చాలా ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ . సినిమా చూసిన తర్వాత సినిమా ఎందుకు ఆలస్యం అయ్యిందనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీ అంచనాలని ఏజెంట్ అందుకుంటుంది. సురేందర్ రెడ్డి అఖిల్ మమ్ముటీ, సాక్షి అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. స్పై చిత్రాలు వరల్డ్ వైడ్ వుండే చిత్రాలు. ఏజెంట్ చూసిన తర్వాత ఎందుకు సమయం పట్టిందో అర్ధమౌతుంది. ఏజెంట్ అందరికీ అద్భుతమైన అనుభూతి ఇచ్చే చిత్రం’’ అన్నారు.
సాక్షి వైద్య మాట్లాడుతూ.. నాపై నమ్మకం వుంచి ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసిన సునీల్ గారు, సురేందర్ రెడ్డి గారు, అఖిల్ గారికి కృతజ్ఞతలు. ఇది నాకు చాలా పెద్ద అవకాశం . అఖిల్ గ్రేట్ కో స్టార్. చాలా సపోర్టివ్. రసూల్ గారు చాలా అందంగా చూపించారు, అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
డినో మోరియా మాట్లాడుతూ… ఏజెంట్ నా మొదటి తెలుగు చిత్రం. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఏజెంట్ లో భాగం కావడం నాకు ఆనందంగా వుంది. ఏజెంట్ అద్భుతమైన సినిమా. అఖిల్ వండర్ ఫుల్ కోస్టార్. ఇందులో అఖిల్ అద్భుతంగా కనిపిస్తారు. మమ్ముట్టీ గారితో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. సురేందర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా వుంది’’ అన్నారు.
రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ.. ఏజెంట్ కోసం టెక్నికల్ గా చాలా కొత్త పద్దత్తుల్లో షూట్ చేశాం. అఖిల్ అద్భుతంగా కనిపిస్తారు. సురేందర్ రెడ్డి స్తయిలీస్ దర్శకుడు. నిర్మాతలకు కృతజ్ఞతలు. ఏజెంట్ గ్రేట్ జర్నీ’’ అన్నారు.
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు.