అప్పటివరకూ సురేందర్ రెడ్డి కమర్షియల్ సినిమాలు మాత్రమే తీయగలడు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళందరూ షాక్ అయిపోయే రేంజ్ లో “సైరా” చిత్రాన్ని తెరకెక్కించి తాను ఎలాంటి చిత్రాన్నైనా తీయగలను అని నిరూపించుకున్నాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాక సురేందర్ రెడ్డి స్థాయిని పెంచింది. “సైరా నరసింహారెడ్డి” విడుదలై నెల రోజులు పూర్తయిన తర్వాత కూడా సూరి తన తదుపరి సినిమా ఎవరితో అనే విషయం ప్రకటించలేదు. నిజానికి స్టార్ హీరోలందరూ ఇప్పుడు ఇమ్మీడియట్ గా సురేందర్ రెడ్డితో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే.. సురేందర్ రెడ్డి మాత్రం తన తదుపరి చిత్రం దర్శకుడిగా కాక నిర్మాతగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తన దగ్గర గత రెండు మూడు సినిమాలుగా అసోసియేట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్న ఇద్దర్ని దర్శకులుగా పరిచయం చేయనున్నాడు సురేందర్ రెడ్డి. ఈమేరకు స్వంత బ్యానర్ ను కూడా రిజిష్టర్ చేశాడు సురేందర్ రెడ్డి. సదరు యువ దర్శకులు తెరకెక్కించే చిత్రాలలో యువ కథానాయకులు నటిస్తారా లేక నటీనటులను కూడా కొత్తవారిని పరిచయం చేసే అవకాశాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!